సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షలు షురూ


Sat,September 21, 2019 02:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్ రాత పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి. ఈ పరీక్షలు 21, 22, 28, 29తేదీల్లో సైతం రెండు సెషన్లుగా పరీక్షలు కొనసాగనున్నాయి. చింతలబస్తీ డిగ్రీ కళాశాల, జాగృతి డిగ్రీ కళాశాల రాంకోఠి, బజార్‌ఘాట్‌లలోని జూనియర్ కాలేజీల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 658 మంది అభ్యర్థులకు గాను 641మంది హాజరుకాగా, 17 మంది గైర్హాజరైనట్లుగా అధికారులు తెలిపారు. శనివారం నుంచి రెండు సెషన్లలో ఉదయం 9-12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.

197

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles