సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం


Sun,September 22, 2019 12:56 AM

మలక్‌పేట/ఎల్బీనగర్ : దిల్‌సుఖ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటి నభా నటేశ్‌లు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాల్‌లోని మూడు అంతస్తులను కలియ తిరిగిన మంత్రి వస్ర్తాలు ఎక్కడెక్కడ నుంచి తెప్పిస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో అన్నిరకాల నాణ్యమైన వస్ర్తాలు సరసమైన ధరలకు లభిస్తాయని, అదేవిధంగా బంగారు, వెండి ఆభరణాలు హ్యాండ్ మేడ్‌వి లభిస్తాయని తెలిపారు. వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన నిర్వాహకుడు సతీశ్ బతుకమ్మ పండుగకు కస్టమర్లకు సరసమైన ధరలకు వస్ర్తాలు అందించి అభిమానాన్ని చూరగొంటారని, త్వరలోనే షాపు వ్యాపార వృద్ధిలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విచ్చేసిన సినీనటి నభా నటేశ్ ఆభరణాల విభాగాన్ని ప్రారంభించి, పలు రకాల ఆభరణాలను ధరించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా నభా నటేశ్ మాట్లాడుతూ తాను చాలాసార్లు సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో ఆభరణాలు, వస్ర్తాలు కొనుగోలు చేశానని, నాణ్యతగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీకదీపం సీరియల్ నటీనటులు షాపింగ్‌మాల్‌లో సందడి చేశారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, షాపింగ్ మాల్ నిర్వాహకులు సతీశ్, భవన యజమానులు గండి కృష్ణయాదవ్, గండి జగన్‌యాదవ్ పాల్గొన్నారు.

222

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles