సంగీత విద్యాంసుడు జనార్దన్ మిట్టాకు సన్మానం


Sun,September 22, 2019 12:56 AM

సుల్తాన్‌బజార్ : ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటినరీహాల్‌లో ప్రముఖ సితార సంగీత వాయిద్య విద్వాంసుడు జనార్దన్ మిట్టా శనివారం సంగీత ప్రియులను ఓలలాడించారు. ఎకనామిక్ కమిటీ ఆంధ్రప్రదేశ్, సురమండల్‌ల సంయుక్తాధ్వర్యంలో జనార్దన్ మిట్టాకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీగాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ఎకనామిక్ కమిటీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ప్రభా శంకర్, సురమండల్ అధ్యక్షుడు మోహన్ ఎంఆర్‌డీ, ఎకనామిక్ కమిటీ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రావు, ఉస్మానియా గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, సొసైటీ సభ్యులు అశ్విన్ మార్గంలతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జనార్దన్ మిట్టాకు సితార వాయిద్యంలో మంచి గుర్తింపు ఉందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు గోవింద్, మనోజ్‌కుమార్, దిలీప్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

168

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles