కొండా లక్ష్మణ్‌బాపూజీకి భారతరత్న ప్రకటించాలి: యాదగిరి


Sun,September 22, 2019 12:57 AM

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ: నాటి నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడటమే కాకుండా ఏడోనిజాంపైన బాంబుదాడి చేసి పో రాట ఉధృత స్వభావాన్ని వ్యక్తపర్చిన తెలంగాణ ధీశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని పద్మశాలీ సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రేటర్ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అం బర్‌పేట నియోజకవర్గం పద్మశాలీసంఘం ఎనుగంటి నరేందర్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఏడో వర్ధంతిని గోల్నాకలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. దీనికి తెలంగాణ పద్మశాలీసంఘం అధ్యక్షుడు యాదగిరి, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, వనం రమేష్, సినీ గే య రచయిత వడ్డేపల్లి కృష్ణ హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నో అవకాశాలు వచ్చిన పదవులను చేపట్టకుండా పోరాడిన ఏకైక వ్యక్తి బాపూజీ అన్నారు. తెలంగాణ ఏర్పా టు కోసం చలిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 95 ఏళ్ల వయస్సు దీక్షకుబూనిన వ్యక్తి అని కొనియాడా రు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్‌బండ్ పై కొండా లక్ష్మ ణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పాండురంగయ్య, అంజయ్య, న ర్సింగ్‌రావు, కృష్ణ, రాజా, రమేష్, సత్తయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

183

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles