గురుకులాలు గుడులతో సమానం


Sun,September 22, 2019 12:59 AM

మారేడ్‌పల్లి: గురుకులాలు గుడులతో సమానమని ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం మహేంద్రాహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలను ఎర్రోళ్ల శ్రీనివాస్ సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, ల్రైబరీ, కిచెన్, హాస్టల్‌లో గదులను పరిశీలించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్థులను ప్రేమతో పలకరిస్తూ...పాఠశాల, హాస్టల్‌లో ఉన్న సమస్యలు, వసతులు, విద్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భం గా ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నేను మీ లెక్కనే ఐదో తరగతి నుంచి పీజీ వరకు హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని తెలిపారు. ఆ సమయంలో దొడ్డు బియ్యంతో అన్నం ఉండేదని, మాకు వడ్డించిన సాంబారులో నల్ల, తెల్ల పురుగులు వచ్చేవని..వాటిని తొలగించి తినే వాళ్లమన్నారు. ఎందుకంటే గత పాలకులు, అధికారు లు గురుకుల పాఠశాలు, హాస్టల్స్, విద్యార్థుల సౌకర్యాలను పట్టించుకోలేదన్నారు.


కానీ నేడు సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశా లు, హాస్టల్స్‌లో సన్నబియ్యంతో కూడిన రుచికరమైన ఇంటి భోజనాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులందరికీ సౌకర్యాలు కల్పిస్తూ... కార్పొరేట్ పాఠశాలకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రభు త్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ...విద్యార్థులందరూ కష్టపడి భవిష్యత్‌లో ఉన్నత స్థానాల్లో నిలువాలని సూచించారు. గురుకుల పాఠశాలలు అంటే క్రమశిక్షణ, ప్రతిభకు మారు పేరు అని...విద్యార్థులందరూ ఆ పేరును నిలబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ కమలమ్మ, మారేడ్‌పల్లి తహసీల్దార్ అనిత, బోయిన్‌పల్లి మార్కెట్ యార్డు డైరెక్టర్ శర్విన్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

170

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles