ప్రతి ఒక్కరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

Thu,July 11, 2019 01:40 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరీ కృషితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ స్టేట్ లెవెల్ కమిటీ చైర్మ న్ జస్టిస్ సీవీ రాములు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి జస్టిస్ సీవీ రాములు రాగా, కలెక్టర్ శరత్ పుష్పగుచ్ఛంతో ఆహ్వానిచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరీ బాధ్యతగా కృషి చేయాలన్నారు. మొదటగా జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల సేకరణ, నిర్వహణ, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు అ ధికారులకుర పౌరులు సహకరించాలనీ, ఆ దిశగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం క లెక్టర్‌తో కలిసి చైర్మన్ సీవీ రామన్, కలెక్టర్ కార్యాలయ పరిసరాలు, జిల్లా ప్రధానసుపత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు ము న్సిపాలిటీలు, 380 గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త డబ్బాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించేటప్పుడు తడిచెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యా ర్డుకు చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా తడి, పొడి చెత్త సేకరణకు ఒక లక్షా 85వేల డబ్బాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 55 శాతం వరకు సోప్ పిట్స్, ఇంకుడు గుంతల నిర్మాణాల పూర్తి చేశామనీ, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామన్నారు. సామూహిక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామ సెక్రటరీలతో స మావేశం ఏర్పాటు చేసి అవగాహనను కల్పించామని తెలిపారు. జిల్లాలో సీఎం స్వచ్ఛ హరిత గ్రామం కార్యక్రమా న్ని ప్రతి మంగళవారం పరిశుభ్రత పచ్చదనం త్వరలో ప్రారంభించనున్నామన్నారు. జిల్లా వ్యా ప్తంగా 854 ప్రభుత్వ పాఠశాలలు, 297 ప్రైవేటు పాఠశాల విద్యార్థులను కూడా పర్యావరణ పరిరక్షణపై చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బీ రాజేశం, జడ్పీ సీఈఓ ఏ శ్రీనివాస్, జేసీఈఈ ఆర్ రవీందర్ రెడ్డి, ఎస్సీఈఈ హన్మంతరెడ్డి, సైంటిస్టు డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, డీపీఓ శేఖర్, ఆర్డీఓ ఘంటా నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles