ప్రాజెక్టులతో గ్రామాలకు జలకళ

Fri,July 12, 2019 02:31 AM

కొడిమ్యాల : స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో గ్రామాలు జలకళను సంతరించుకోనున్నాయని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలం పూడూర్‌లో ఆత్మ ఆధ్వర్యంలో వరినాటు వేసే యం త్రం (ట్రాన్స్‌ఫ్లాంటర్)తో నాటు వేసే విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వగా, కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలు ముంబయితో పాటు దేశ విదేశాలకు వలస వెళ్లారనీ, నేడు సీఎం కేసీఆర్ కృషితో ప్రాజెక్టులు నిర్మించగా స్వ గ్రామాల బాటపడుతున్నారన్నారు. దేశంలోనే పెద్ద ప్రాజేక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులకు నీళ్లు అందించాలని ప్రణాళికలు రూపొందించారనీ, దీంతో ఎక్కడ చూసిన రైతుల ముఖా ల్లో సంతోషం కనబడుతుందని చెప్పారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులను అవలంభించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పనులు చేసే యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీపై అందస్తుందనీ, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వరినాటు యంత్రాన్ని నడిపి రైతులకు ఉపయోగాలను వివరించడంతో పాటు ఎమ్మెల్యే స్వయంగా పొలంలోకి దిగి నారుపోసే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జగితా ్యల పొలాస వ్యవసాయ క్షేత్రం ఏడీఆర్ ఉమారెడ్డి, ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు నసీరొద్దిన్, గ్రామ సర్పంచ్ పెద్ది కవిత, ఎంపీటీసీ సభ్యులు అనుమండ్ల రాఘవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ అబ్బిడి లకా్ష్మరెడ్డి, సర్పంచ్ గరిగంటి మల్లేశం, ఏఓ పర్లపల్లి జ్వోతి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, నాయకులు పెద్ది రవి, వెల్ముల రాంరెడ్డి, ఓల్లాల లింగాగౌడ్, చింతపంటి ఐలయ్య, ఆదయ్య, ఏడెల్లి పర్షరాములు, కడారి రఘుపతిరెడ్డి, మోతె మల్లారెడ్డి తెలిపారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles