అభివృద్ధ్దే ధ్యేయం..

Fri,July 12, 2019 02:32 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం లో పూర్తిగా అంతరించి పోతున్న కుల వృత్తుల అభివృద్ధే ధ్యేయమని బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్ అన్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు బీసీ కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణమోహన్ గురువారం ఎస్సారెస్పీ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మా ట్లాడుతూ రాష్ట్ర బీసీ కమషన్ బీసీ కులాల జాబితాలో చేర్చడం కోసం 30 కులస్తుల దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించడానికి జూన్ 15 నుంచి జూలై 5వ తేదీ వరకు బీసీ కమిషన్ కా ర్యాలయం, హైదరాబాద్‌లో విచారణ కోసం పేపరు ప్రకటన ఇవ్వగా, కేవలం 18 కులస్తులు మాత్రమే హాజరైనారని తెలిపారు. వారి కుటుంబాల స్థితిగతులు వారి యొక్క వేషధారణ వారి యొక్క వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి కమిషన్ వా రు వివిధ జిల్లాలకు వెళ్లామన్నారు. దీనిలో భా గంగా జగిత్యాల, కరీనగర్, వరంగల్(రూరల్), వరంగల్(అర్బన్), మహబూబాద్ జిల్లాలను అధ్యయన కోసం వచ్చినట్లు తెలిపారు. మొదట జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, జగిత్యాల, పైడిమడుగు, కట్కూర్, ముత్యంపేట, మెట్‌పల్లిలో అరవకొమటి, ఎన్నోటి, గౌడజెటి, బాగోతులు, సన్నాయి వారి కుటుంబాలను సంప్రదించీ, వా రి యొక్క వేషధారణలు అధ్యయనం చేశామన్నా రు. కులధ్రువీకరణ లేకుండా, ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధి పొందకుండా చదువు లేక పూర్తి గా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. అందుకే వీరి కోసం నేరుగా వారు నివాసం ఉం డే ప్రదేశాలకు వెళ్లి కుటుంబ స్థితిగతులను అధ్యయనం చేసి, వాస్తవాలు తెలుసుకుని వారి యొ క్క స్థితిగతులను వేషధారణ రికార్డులను సీడీ రూపంలో కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. వీరి యొక్క కళారూపాలను బుక్‌లాగా తయారు చేసి, బావి తరాల కోసం భద్రపరుస్తామన్నారు. ఆయన వెంట జిల్లా బీసీ సం క్షేమాధికారి రాజలింగం పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles