ఫిష్ హబ్‌గా తెలంగాణ

Fri,July 12, 2019 02:33 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : మత్స్యరంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులతో రాబోయే రోజుల్లో తెలంగాణ ఫిష్ హబ్‌గా మారనుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 11 మంది మత్స్యకారులకు సమీకృత మత్స్య అభివృద్ధ్ది పథకం కింద 75శాతం సబ్సిడీపై లగేజీ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్య వస్థ బలోపేతం చేసేందుకే ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్రహిస్తుందనీ, ఇందులో భాగంగా మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు వీలు గా ఆటోలు అందజేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ఒక తెలంగాణేనన్నారు. కులవృత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకే ఉచితంగా చేపపిల్లలు సరఫరా చేయడంతో పాటు విక్రయించుకునేందుకు ఆటో లు, మోపెడ్‌లు సబ్సిడీపై అందజేస్తున్నట్లు చెప్పా రు. ధర్మపురి నియోజకవర్గంలోని ఒక్క ధర్మారం మండలానికే 200 మంది లబ్ధిదారులకు మోపెడ్‌లు అందజేసినట్లు గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులంటే కేవలం సముద్రతీర ప్రాంతాల్లో ఉండేవారనే భావన ఉండేదన్నారు. తెలంగాణలోని చెరువులు, రిజర్వాయర్లలో చేప లు పెంచేందుకు అద్భుతమైన అవకాశాలున్నా ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. స్వరా ష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తుల అభివృద్ధిపై సారించగా, మత్స్య రంగం దశ తిరిగిందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు దాదాపు 150 కిలోమీటర్ల పొడవునా నీరు పుష్కలంగా నిలిచి ఉం టుందనీ, ఆ రిజర్వాయర్లలో లక్షల, కోట్లలో మ త్స్య సంపదను సృష్టించనున్నామన్నారు. అలాగే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ప్రస్తుతం ధర్మపురి వరకు విస్తరించి ఉండగా.. రానున్న రోజుల్లో ధర్మపురి మండలం జైన వద్ద బరాజ్, సదర్మాట్ వద్ద మరో బరాజ్ నిర్మాణాలు పూర్తయితే గోదావరి పొడవునా నీరు నిలిచి ఉండడంతో పెంపకందారుల జీవితాలే మారిపోతాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువలన్నీ పునరుద్ధరిస్తున్నామనీ, వాటిల్లోనే చేపలు పెంచనున్నట్లు చెప్పారు. ఏటా 2.2 టన్నుల చేపల ఉత్పత్తితో దేశంలోనే రాష్ట్రం 8వ స్థానంలో ఉందనీ, మరింత ముం దుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరు ణ, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేశ్‌కుమార్, సౌళ్ల భీమయ్య, పులిశెట్టి మల్లేశం, సంగి శేఖర్, మ్యాన శంకర్, స్తంబంకాడి రమేశ్, మురికి శ్రీనివాస్, ఇనుగంటి వినోద్‌రావ్, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్, అక్కనపల్లి సునీల్‌కుమార్, మామిడి లింగన్న, అనంతుల లక్ష్మణ్, లక్కాకుల భగవంతరావ్, చిలివేరి శ్యాం సుందర్, జెట్టి రాజన్న, చుక్క భీమ్‌రాజ్, స్తంబంకాడి మహేశ్, బండారి అశోక్, సయ్యద్ ఆసిఫ్, ఇక్రామ్, అలీమ్, మత్స్యశాఖ ఏడీ రాణా ప్రతాప్, సంఘం అధ్యక్షుడు గజ్జి మల్లేశ్, ఉపాధ్యక్షుడు నర్ముల శంకర్, గరిగె గంగన్న పాల్గొన్నారు.

రూ. 41.80లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నియోజకవర్గానికి చెందిన 132 మందికి మం త్రి కొప్పుల ఈశ్వర్ రూ.41.80లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గురువారం కరీంనగర్‌లోని ఆయన క్యాం ప్ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వైద్యఖర్చు లు అందజేస్తుందన్నారు. నిరుపేదలు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles