మౌలిక సదుపాయాలకు ప్రత్యేక చర్యలు

Sun,July 14, 2019 01:04 AM

కోరుట్లటౌన్: పట్టణలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని 1, 15వ వార్డుల్లో రూ. 50 కోట్ల మున్సిపల్ ప్రత్యేక నిధులతో చేపట్టిన ప్రతిపాదిత పనులకు భూమిపూజ చేశారు. అంతకుముందు స్థానిక పద్మశాలీ సంఘం భవన నిర్మాణ పనులకు మంజూరైన రూ.20 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. పద్మశాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగుకాల్వల ఆధునీకరణ, కల్వర్టుల మరమ్మతు పనులు, జాతీయ రహదారి మధ్యలో గ్రీనరీతో కూడిన డివైడర్‌ల ఏర్పాటు, ఇరువైపులా డ్రైనేజీ పనులు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పార్క్, మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు రుసుమును ఎమ్మెల్యేకు మాజీ కౌన్సిలర్లు యాటం కరుణాకర్, కస్తూరి వాణి అందజేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత అనూప్‌రావుకు సభ్యత్వ నమోదు రసీదును ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ అధ్యక్షుడు గడ్డమీది పవన్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, ఎంపీపీ తోట నారాయణ, మల్లాపూర్ జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జక్కుల జమున, బట్టు సునీల్, మోర్తాడు లక్ష్మీనారాయణ, పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్, సాయిబాబా దేవాలయం అధ్యక్షుడు పోతని భూమయ్య, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, నాయకులు వాసం భూమానందం, జక్కుల జగదీశ్వర్, ఫహీమ్, మచ్చ రమేశ్, ద్యావనపల్లి ఆనందం, జిల్లా ధనుంజయ్, పండిత్ రాజేశ్వర్, సదబత్తుల వేణు, రుద్ర సుధాకర్, జిందం లక్ష్మీనారాయణ, బెజ్జారపు రాజు, నగేశ్, అన్వర్, మోసీన్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles