ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

Sun,July 14, 2019 01:05 AM

- స్వరాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశాం

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల అర్బన్ : తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలో రూ.17.85కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడు తూ తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో గుణాత్మక మార్పులు సాధించామనీ, గతంలో ప్రభుత్వ దవాఖానలు అంటే చిలుము పట్టిన మంచాలు కనిపించేవనీ, కానీ ఇప్పుడు అధునాతన వసతులతో వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానల్లో లభిస్తున్నాయన్నారు. ఐసీయూ, డయాలసి స్, ఈసీజీ వంటి సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ర్టాలతో వైద్య రంగంలో తెలంగాణ పోటీ పడుతున్నదని చెప్పారు. దీనికి ముఖ్య ఉదాహరణ కేసీఆర్ కిట్లన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ముందు చూపుతో కేసీఆర్ కిట్లను అందజేసి గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అం దిస్తూ పుట్టింటి బాధ్యతలను తీరుస్తున్నారని కొనియాడారు.

రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేట్‌లలో ఆపరేషన్లు 70 శాతం ఉండేవనీ, ప్రస్తుతం ప్రభు త్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 70శాతానికి పెరిగాయని చెప్పారు. ఇప్పటికీ పల్లెల్లో 8నెల లు నిండిన గర్భిణులు సైతం నాట్లు వేసేందుకు, పత్తి ఏరేందుకు వెళ్లేవారు ఉన్నారని చెప్పారు. వా రి బాగోగుల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే 102 వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి, వైద్య సేవలు అందించి, తిరిగి కేసీఆర్ కిట్‌తో ఇంట్లో దిగబెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 700కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లలో నిరుపేదలకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. పేదరికం శాపం కాదనీ, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధిస్తామనీ, ఇక్కడి నర్సింగ్ కళాశాలలో చదివే విద్యార్థులు వైద్యులకంటే ఎక్కువేననీ, నర్సులు అన్ని ఏర్పా ట్లూ చేస్తేనే వైద్యులు వచ్చి ఆపరేషన్ చేస్తారనీ, శ్రద్ధగా చదువుకొని నిరుపేదలకు వైద్యసేవలు అందించాలని సూచించారు.

స్వరాష్ట్రంలోనే కళాశాల పూర్తి : మంత్రి కొప్పుల
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని తెలంగాణ ఆవిర్భవించాక అధిక నిధులను మంజూరు చేయించుకొని పూర్తి చేసుకున్నామని వివరించారు. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో వెటర్నరీ కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారనీ, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లా ప్రజల ఆకాంక్ష అయిన మెడికల్ కళాశాలను సై తం సీఎం కేసీఆర్ తీరుస్తారని చెప్పారు. నిరుపేద ల వైద్యం కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని పనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నద ని చెప్పారు. గతంలో కంటే మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ వైద్యశాలల్లో అందిస్తున్నామన్నా రు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా సేవలు మెరుగయ్యాయన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభు త్వ దవాఖానలో శుక్రవారమే సమీక్ష నిర్వహించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారని చెప్పారు. మంత్రి ఈటల పేదల మనిషనీ, రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు మెరుగైన వైద్యసేవ లు అందిననాడు మంత్రి ఈటల సంతోషిస్తారనీ, అప్పుడు ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లేనన్నారు.

సమస్యలు తీర్చాలి : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాష్ట్రం ఏర్పడక ముందు శంకుస్థాపన చేసిన నర్సింగ్ కళాశాల భవనానికి తెలంగాణ వచ్చాక సీ ఎం కేసీఆర్ నిధులు ఇచ్చి, అనువైన స్థలాన్ని కేటాయించారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వి వరించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే జిల్లా వైద్యశాలతో పాటు మాతాశిశు సంరక్షణ కేంద్రం కూడా నిర్మాణంలో ఉందన్నారు. నర్సింగ్ కళాశాల సమస్యలను మంత్రి ఈటల తీర్చాలని కోరారు. నర్సింగ్ కళాశాలలో బోధనా సిబ్బందిని నియమించాలనీ, హాస్టల్ నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని కోరారు. ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలకు దీటుగా నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టామనీ, మరో 20 శాతం పనులు పూర్తయితే రాష్ట్రంలోనే మంచి కళాశాలగా పేరుతెచ్చుకుంటుందన్నారు.

సేవాభావంతో పనిచేయాలి : ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వైద్య రంగంలో విద్యను అభ్యసించిన అనంతరం ఇతర దేశాల్లో కాకుండా మన రాష్ట్రంలో సేవాభావంతో పనిచేయాలని విద్యార్థులను కోరారు. తనకు ఇద్దరు పిల్లలనీ, ఇద్దరూ వైద్యులుగా ఇక్కడే సేవలందిస్తున్నారని చెప్పారు.

మానవసేవే మాధవసేవ : జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత
జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ విద్యతో వినయం లభిస్తుందనీ, మానవ సేసే మాధవ సేవ అనీ, మానవులకు సేవచేయడమే నర్సుల వృత్తి ధర్మమన్నారు. ఇంతమంచి కళాశాలను జగిత్యాలలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ విద్య లక్ష్యం సేవ చేయడమనీ, సేవే పరమార్థంగా చదివి ముందుకు వెళ్లాలని సూచించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తితో పాటు నర్సింగ్ వృత్తి కూడా చాలా పవిత్రమైందన్నారు. జగిత్యాల నర్సింగ్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. హాస్టల్ పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి మాట్లాడుతూ 2014లో ప్రారంభమైన ఈ కళాశాలలో ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించారన్నారు. ఓర్పు, సహనం ఉన్నవారు మాత్రమే నర్సింగ్ విద్యలో రాణించగలుగుతారన్నారు. సకల సదుపాయాలతో నిర్మించిన ఈ కళాశాల భవనం ప్రారంభం కావడం సంతోషకరమనీ, ఇలాంటి కళాశాల ప్రస్తుతం రాష్ట్రంలో జగిత్యాలలోనే ఉందన్నారు. అనంతరం మంత్రులు ఈటల, కొప్పుల, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావును డైరెక్టర్ రమేశ్ రెడ్డి, ప్రిన్సిపాల్ విద్యావతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జేసీ బేతి రాజేశం, జగిత్యాల రూరల్ ఎంపీపీ గాజర్ల గంగారం గౌడ్, జడ్పీ సభ్యులు పునుగోటి ప్రశాంతి, జాదవ్ అశ్విని, టీఆర్‌ఎస్ నాయకులు దావ సురేశ్, బోగ ప్రవీణ్, కత్రోజు గిరి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles