చూసి.. చలించి..

Mon,July 15, 2019 01:36 AM

క్షతగాత్రులను వాహనంలో దవాఖానకు తరలింపు

కొడిమ్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని దవాఖానకు తమ కాన్వాయ్ వాహనంలో తరలించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే శనివారం జగిత్యాల జల్లా కేంద్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు ఇద్దరూ కరీంనగర్ నుంచి జగిత్యాలకు రోడ్డు మార్గంలో బయలుదేరారు.

గోపాల్‌రావుపేటకు చెందిన కోమటి చంద్రశేఖర్, భార్య నళిని, కొడుకు నళినిచంద్ర బైక్‌పై పూడూర్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా కొడిమ్యాల మండలం నమిలకొండ శివారులో ఇస్లాంపూర్ స్టేజీ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారు. జగిత్యాల వెళ్తున్న మంత్రులు రాజేందర్, ఈశ్వర్ తమ వాహనాలను అపి గాయపడ్డ వారిని లేపి మంచినీళ్లు అందించారు. వెంటనే కాన్వాయిలోని ఓ వాహనంలో ఎక్కించి కరీంనగర్ దవాఖానకు పంపించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్లో సూచించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వీరి వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles