సర్కారు దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు

Mon,July 15, 2019 01:37 AM

- గతంలో ప్రభుత్వ దవాఖానలంటే భయపడేవారు
- రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారింది
- సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే మెరుగైన వైద్య సేవలు
- వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
- సర్కారు వైద్యశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తాం
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

జగిత్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సర్కారు దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొ న్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రు లు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశానికి శనివారం హాజర య్యారు. సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భ యపడి, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యం కోసం అ ప్పులు చేసేవారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులంటే చిలుము పట్టిన మంచాలు, విరిగిపోయిన స్లైన్ బాటిల్ స్టాండ్లు, దుర్వాసనతో ఉండేవన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు మెరుగవడంతో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రభు త్వ వైద్యశాలలు గతానికి ప్రస్తుతానికి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రతి దవాఖానలో డాక్టర్లకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నామన్నారు. దవాఖానల్లో ఇంక్యూబేటర్, శవాలను భద్రపరిచే ఫ్రీజర్, ఎక్స్‌రే మిషన్లు, డయాలసిస్ సెంటర్లు, ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు చేసుకునే వారికి రూ.12 వేలు, కేసీఆర్ కిట్ కూడా అందిస్తామన్నారు. దీం తో జిల్లాలో 70 శాతానికి పైగా ప్రసవాలు సర్కా రు వైద్యశాలల్లోనే జరుగుతున్నాయన్నారు. ప్రభు త్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామనీ, కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందనీ, డాక్టర్లను ప్రజలు ప్రాణాలు కాపాడే దేవుళ్లుగా చూస్తారన్నారు. వైద్యులు కూడా ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలనీ, రోగులు లేరని దవాఖనలను వదిలి వెళ్లకూడదని సూచిం చారు. జిల్లా కేంద్రంలో పనిచేసే వైద్యుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తున్నామ న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్ర వేశపెట్టినా అందరికి అందేటట్లు అమలు చేస్తున్నదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా లో 151 సబ్ సెంటర్లు ఉన్నాయనీ, ఇందులో 25 ప్రభుత్వ భవనాలనీ, మిగతావి అద్దె భవనాలనీ, మెడికల్ ఆఫీసర్లు 35 మంది ఉన్నారనీ, మరో 10 ఖాళీలు ఉన్నాయన్నారు. 302 ఏఎన్‌ఎంలకు 238 మంది మాత్రమే ప్రస్తు తం పనిచేస్తున్నారన్నారు. కంటి వెలుగులో రా ష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో వచ్చిందనీ, కేసీఆర్ కిట్‌లో మంచి స్థానంలో ఉన్నామనీ, సాధారణ ప్రసవాలు 70 శాతం నమోదవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసం త, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజ య్ కుమార్, విద్యాసాగర్ రావు, జేసీ బీ రాజేశం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి ఈటలకు ఘన స్వాగతం
మెట్‌పల్లి టౌన్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ భాధ్యతలు స్వీకరించి శని వారం మొదటిసారి మెట్‌పల్లి పట్టణానికి వచ్చిన సందర్భంగా ఈటల రాజేందర్‌కు కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, టీఆర్‌ఎస్ నా యకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంత్రి ఈటలను ఎమ్మెల్యే విద్యాసా గర్ రావు-సరోజ దంపతులు శాలువాలతో స త్కరించారు. కోరుట్ల నియోజకవర్గంలోని సర్కా రు దవాఖానల అభివృద్ధి కోసం నిధులు మం జూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు మంత్రి ఈటల రాజేందర్‌కు వినతి పత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, జెడ్పీటీసీలు సందిరెడ్డి శ్రీనివా స్ రెడ్డి, కముటం భారతి, కాటిపెల్లి రాధ శ్రీనవాస్ రెడ్డి, కోరుట్ల మాజీ మున్సిపల్ అధ్యక్షుడు గడ్డమి ది పవన్, నాయకులు పూదరి నర్సగౌడ్, డీలర్ మల్లయ్య, ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్, కోటబు చ్చి గంగాధర్, జాజాల జగన్‌రావు, చింతమని ప్రభు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles