పదిలో హ్యాట్రిక్ అభినందనీయం

Wed,July 17, 2019 04:02 AM

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదో తర గతి ఫలితాల్లో హ్యోట్రీక్ సాధించడం అభినందనీ యమని కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాలోని ప్రధా నోపాధ్యాయులతో మంగళవారం జిల్లా కేం ద్రం లోని పొన్నాల గార్డెన్‌లో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో రాష్ట్రంలో మొదటి స్థానంలో మూడుసార్లు నిలబెట్టినందుకు ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏది తలపెట్టినా ముందు వరుసలో ఉంటుందనీ, మ నం తలచుకుంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపిస్తూ మూడేళ్లు పదో తరగతి ఉత్తీర్ణతను రాష్ట్ర చరిత్రలో తిరగరాశారన్నారు. విద్యార్థుల హాజరు శా తం నూటికి నూరు శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో తక్కువ హాజ రుశాతం నమోదుపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరుశాతాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోవడమే ప్రధాన కారణమన్నారు. హాజరు శాతాన్ని ఆన్‌లైన్‌లో తప్పక అప్‌లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి పాఠశాలకు రాకుంటే ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలనీ, అనారోగ్యంతో పాఠశాలుకు రా లేకపోయాడని తోటి విద్యార్థులు చెప్పితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్‌కు, ఏఎన్‌ఎంలకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. గ్రా మంలోని స్వయం సహాయక సంఘాల, మహిళా సంఘాల వారి పిల్లలు పాఠశాలలకు పంపించకపోతే, పాఠశాలకు గైర్హాజరైనప్పుడు లిస్టును త యారు చేసి గ్రామ కార్యదర్శికీ, మహిళా సంఘా ల నాయకులకు ఇచ్చి పిల్లలను పాఠశాలలకు వచ్చే లా చూడాలని తెలిపారు. ఉపాధ్యాయులు సైతం కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని ఆ గ్రామంలోని పిల్లలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమించామనీ, ప్రత్యేక అధికారి ప్రతి వారం ఒకటి లేదా రెండు పాఠశాలలు తనిఖీ చేసి రిపోర్టు ఇస్తారన్నా రు. అలాగే ప్రతి 15రోజులకూ ఒకసారి సమీక్షిస్తా మని తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో పాఠశాలల హాజరును పట్టి కను అంద జేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వంటలు బాగా వండి విద్యార్థులకు అందించాలన్నారు. మండల కేంద్రంలో వంట వండే వారికి శిక్షణనివ్వాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు. నూటికి నూరుశాతం హాజరు ఉన్న పాఠశాలకు, గ్రామాలకు అ వార్డు ఇస్తామని తెలిపారు. అనంతరం జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పది పరీక్షల అనంత రం ఈ ఏడాది ఇదే మొదటి సమావేశమన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పాఠశాలల్లో 2500 మంది విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. జిల్లాలో 65వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles