పాడితోనే రైతులు ఆర్థికంగా ఎదుగుతారు

Fri,July 12, 2019 02:35 AM

జనగామ రూరల్ : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం వల్ల పాల దిగుబడి పెరిగి రైతులు ఆర్థికంగా ఎదుగుతారని రాష్ట్ర గొర్రెలు, మేకల మేనేజింగ్ డైరెక్టర్, సంచాలకుడు లకా్ష్మరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసరమడ్ల, మరిగడి గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పసరమడ్లలో నిర్వహించించిన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోందని, అందులో భాగంగానే ఉపాధిహామి పథకంలో గొర్రెల, బర్రెల షెడ్లు, గడ్డి విత్తనాలు, దాణా, మందులు, మంద వద్దకే పశుసంచార వాహనం వచ్చి ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. రైతులకు వ్యవసాయ తరువాత అత్యంత లాభదాయకమైనది పాడి పరిశ్రమనేనని ఆయన తెలిపారు. గొల్లకుర్మలకు త్వరలోనే గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. రైతులు తప్పకుండా పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ మాచర్ల భిక్షపతి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు యార నర్సయ్య, ఎంపీపీ మేకల కలింగరాజుయాదవ్, సర్పంచులు శివరాత్రి స్వప్నరాజు, ఇట్టబోయిన రజిత, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జనగాం సోమిరెడ్డి, మండల పశువైద్యులు పోరిక రామకృష్ణ, బయగాని రవిప్రసాద్, పశువైద్య సిబ్బంది నరేందర్‌గౌడ్, హఫీజ్, శ్రీధర్‌బాబు, నజీరుద్దున్, సత్యనారాయణ, హరిబాబు, గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles