నరసింహరామయ్య సిద్ధాంతి సేవలు చిరస్మరణీయం

Mon,July 15, 2019 01:53 AM

- భావితరాలు సిద్ధాంతిని ఆదర్శంగా తీసుకోవాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకొడకండ్ల : తాను ఎంచుకున్న లక్ష్యం వైపు కష్టమైనా ఇష్ట కార్యసాధన దిశగా ముందుకు సాగిన మహనీయుడు వేద పండితుడు పాలకుర్తి నరసింహరామయ్య సిద్ధాంతి సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీయోగలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు అద్యక్షతన పాలకుర్తి రామమూర్తిశర్మ రచించిన తమస్సు నుంచి ప్రకాశం వైపు శ్రేష్ఠ సాధన దిశలో పాలకుర్తి నరసింహరామయ్య నడక అనే పుస్తక ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్ధాంతిని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ స్వయాన సిద్ధాంతి పల్లకి మోశారని, అలాంటి మహనీయుడు ఇక్కడే పుట్టి ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చారని అన్నారు. ఈ మహనీయుడి జ్ఞాపకార్థం కొడకండ్లలో స్మృతివన్నాని నిర్మించడాకి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సిద్ధాంతి పేరిట పాలకుర్తి దేవస్థానం వద్ద వేద పాఠశాలను స్థాపించడం కోసం కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధాంతి కుటుంబసభ్యులు, ఎంఎల్‌ఎన్ శాస్త్రి, కే విద్యాసాగర్, సర్పంచ్ మధుసూదన్, వెంకటేశ్వర్లు, గిరిజా మనోహర్‌బాబు, జీసీసీ చైర్మన్ మోహన్‌గాంధీనాయక్, ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీ నాయక్, జెడ్పీటీసీ సత్తమ్మ, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, పలువురు వేద పండితులు, మండల టీఆర్‌ఎస్ నాయకులు, సిద్ధాంతి శిష్య బృందం పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles