కారడవిలో కాళేశ్వరం బాట

Mon,July 15, 2019 02:02 AM

అడవిలో అపురూప దృశ్యం.. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుత కట్టడం.. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం(మేడిగడ్డ) గొలుసుకట్టు ప్రాజెక్టు.. అపరభగీరథుడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా గోదావరి నదిపై చేపట్టిన ఈ ప్రాజెక్టును గత నెల 21న జాతికి అంకితం చేశారు. 16.17 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టులో శనివారం సాయంత్రానికి 5.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. పాలసంద్రం వలె ఎటుచూస్తే అటు జలాలు. మేడిగడ్డ నుంచి దాదాపు 25 కిలో మీటర్ల దూరానికి బ్యాక్‌వాటర్ చేరింది. కన్నెపల్లి నుంచి పంపింగ్ చేసిన జలాలు కారడవిలో తవ్విన కాలువ ద్వారా ఇలా అన్నారం బ్యారేజీకి చేరుతున్నాయి. -వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తేతెలంగాణ

గోదారమ్మ రాకతో తెలంగాణ రైతాంగం కల సాకారం అయ్యేలా కాళేశ్వరంలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీలు నిండుకుండను తలపిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అన్నారం బ్యారేజీలో 3.1 టీఎంసీల నీరు చేరింది. కన్నెపల్లి పంపుహౌస్‌లో నిరంతరంగా మూడు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నాయి. సుందిళ్లబ్యారేజీకి తరలించడానికి కనీసం మరో మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటి అవసరం ఉన్నది. కన్నెపల్లిలో ఆదివారం నుంచి ఐదో మోటార్ కూడా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. - వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles