కాళేశ్వరంలో శ్రావణ సందడి

Tue,August 13, 2019 03:50 AM


కాళేశ్వరం, ఆగస్టు 12: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా స్వామి వారిని 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం నుంచే త్రివేణి సం గమం గోదావరి నది పుష్కరఘాట్ తీరంలో భక్తులు స్నానా లు చేసి, నదీమాతల్లికి తర్పణాలు వదిలారు. దీపాలు వెలిగించి, హారతులిచ్చారు. గర్భలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. తులసి చెట్లు వద్ద దీపాలు వెలిగించారు. వివిధ పూజ లు, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.3.76 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో మారుతి తెలిపారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles