ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Wed,August 14, 2019 01:19 AM

జనగామ టౌన్, ఆగస్టు 13: జిల్లా అధికారుల క్రీడా పోటీలు జిల్లాకేంద్రంలో మంగళవారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగాయి. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడల అధికారి జీవీ గోపాల్‌రావు అధ్యక్షతన జిల్లా అధికారులు, సిబ్బందికి మంగళవారం జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో స్పోర్ట్స్‌మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ అధికారులు, సిబ్బంది నుంచి క్రీడా వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుంచి జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసిన తర్వాత 30 నుంచి 60 నిమిషాలు క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు కావాల్సిన క్రీడా సామగ్రిని సమకూరుస్తామన్నారు. పంద్రాగస్టు సందర్భంగానే కాకుండా మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో క్రీడలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం వాలీబాల్, షటిల్, క్రికెట్ ఆటలను ఆడారు. కార్యక్రమంలో జేసీ ఓజే మధు, జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారి మహిపాల్‌రెడ్డి, పోలీస్ శాఖ నుంచి సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సైలు రంజిత్‌రావు, రాజేశ్‌నాయక్, రవికుమార్, పరమేశ్వర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కోలా రాజేశ్‌గౌడ్, జిల్లా ప్రధాన దవాఖాన, ఎంసీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ పీ రఘు, ఆర్‌ఎంవో సుగుణాకర్‌రాజు, పౌరసరఫరాల జిల్లా ఇన్‌చార్జి అధికారి రోజారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్, మున్సిపల్ కమిషనర్ రవీందన్‌తో సహా 853 మంది అధికారులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. బుధవారం విజేతలను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles