సంతోషిమాతకు క్షీరాభిషేకం..

Fri,August 16, 2019 05:19 AM

-ఆలయంలో వైభవంగా రాఖీ మహోత్సవం
జనగామ టౌన్, ఆగస్టు 15: శ్రావణశుద్ధ పౌర్ణమి సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనగామ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ అర్ఛకులు పారునంది శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో భక్తులు అమ్మావారికి క్షీరాభిషేకాలు జరిపించారు. అలాగే పంద్రాగస్టు, రాఖీ పర్వదినాలు ఒకేరోజున రావడంతో దేశభక్తిని చాటుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి భక్తులకు రాఖీలు కట్టి, తీర్థప్రసాదాలను అందించారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు, గాజుల పూజలు, ఒడిబియ్యం మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రేణికుంట కృష్ణా, తడకమళ్ల నర్సింగరావు, కొత్తపల్లి కిరణ్, జైనా రమేశ్, సంతోశ్, వేణుగుప్తా, ఉమారాణి, బిజ్జాల శ్రీకాంత్, నవీన్‌కుమార్ గుప్తా, రంగ నర్సింగరావు, కందూకురి శ్రీనివాస్, మారం ప్రవీణ్, వెంకన్న, శ్రీధర్, శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles