పంద్రాగస్టు వేళ సందర్భంగా.

Fri,August 16, 2019 05:20 AM

దేవరుప్పుల, ఆగస్టు 15: దేవరుప్పుల మండలంలో పంద్రాగస్టును పురస్కరించుకుని పలు కార్యక్రమాలు జరిగాయి. కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ వేడుకలో ఇదే పాఠశాలలో 2000 సంవత్సరానికి చెందిన టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు మరిపెల్లి సతీష్, వీరస్వామి, చంద్రకళతోపాటు పలువురు రూ. 25 వేల విలువచేసే డిజిటల్ టీవీని పాఠశాలకు బహూకరించారు. అలాగే పెదమడూరులో స్వాతంత్య్ర దినోత్సవం వేళ గ్రామానికి చెందిన ఆదర్శయూత్ క్లబ్ కార్యాలయంలో ఆదర్శ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయగా ఎస్సై రామారావు ప్రారంభించారు. అదువిధంగాదేవరుప్పుల కొత్తవాడ ప్రాధమిక పాఠశాలలో జరిగిన వేడుకలో జోగు ప్రవీణ్, ఉప్పుల అనిల్ పాఠశాలకు డ్రమ్స్, పాఠశాల పూర్వఎస్‌ఎంసీ చైర్మన్ తోటకూరి ఎల్లయ్య పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అలాగే నీర్మాలలో జనగామ లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎడమ మోహన్‌రెడ్డి నేతృత్వంలో పశువైద్యశాలలో హరితహారం నిర్వహించారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles