పెండింగ్ భూసమస్యలను వెంటనే పరిష్కరించాలి

Sat,August 17, 2019 03:03 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్, నమస్తే తెలంగాణ : స్టేషన్‌ఘన్‌ఫూర్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పెండింగ్ భూసమస్యల పై డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు .ఈసందర్భంగా ఆర్డీవో రమేశ్ అన్ని మండలాలలోని రైతుల భూముల ఆన్‌లైన్‌కు సంబంధించిన వివరాలు, పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తుల వివరాలపై సమగ్రంగా తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో రమేశ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పాస్‌పుస్తకాల జారీ పక్రియను త్వరగా పూర్తిచేసి రైతుకు పాస్‌పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. పనిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు చిలుపూర్ మండలంలో మొత్తం 12,155 ఖాతాలు ఉండగా, 10,885 ఖాతాలు పూర్తయ్యాయని, అందులో 1,270 పెండింగ్ ఖాతాలు ఉన్నాయనిత అన్నారు.

అదేవిధంగా స్టేషన్‌ఘన్‌ఫూర్ మండలంలో 13,477ఖాతాలుండగా 12,283 ఖాతాలు పూర్తికాగా 1,194 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొడకండ్ల మండలంలో మొత్తం 8,861 ఖాతాలు ఉండగా 8,009 ఖాతాలు పూర్తయ్యాయని 852 పెండింగ్ ఖాతాలు ఉన్నాయన్నారు. జఫర్‌ఘడ్ మండలంలో మొత్తం 14,765 ఖాతాలు ఉండగా, అందులో 13,747 ఖాతాలు పూర్తయ్యాయని, 1,018 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాలకుర్తిలో 19,520 ఖాతాలుండగా 18,582 ఖాతాలు పూర్తికాగా 938 ఖాతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మొత్తం డివిజన్ పరిధిలో 92 శాతం భూప్రక్షాళన పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సర్వేయర్లతో ప్రభుత్వ భూముల సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తహసీల్దార్లు జయచందర్, వీరప్రకాశ్, పుల్లయ్య, సూర్యనాయక్, సర్వేయర్లు సురేందర్, సంపత్, రఘుప్రసాద్, కర్ణాకర్, రాంబ్ర హ్మం, రాజేంద్రప్రసాద్, డీటీ శంకర్, సిబ్బం ది అవినాశ్, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles