కాలంతీరిన సర్టిఫికెట్ల పరిశీలన

Sat,August 17, 2019 03:03 AM

జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19, 20, 21 తేదీల్లో జనగామ ఏరియా ఆస్పత్రిలో దివ్యాంగులకు సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో తాత్కాలికంగా జారీ అయిన సదరం సర్టిఫికెట్లు ఉండి కాలం తీరినవి, ప్రజావాణిలో కొత్తగా చేసుకున్న దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి మాత్రమే శిబిరంలో అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 671 మంది శారీరక దివ్యాంగులు, 171 మంది వినికిడి లోపం, 185 మంది దృష్టి లోపం, 207 మంది మానసిక దివ్యాంగులతో మొత్తం 1,234 మంది అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేశారని, వీరికి మాత్రమే క్యాంపు పరీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అర్హులు ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, మెడికల్ రిపోర్టు వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 19న ఏరియా ఆస్పత్రిలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బచ్చన్నపేట, లింగాలఘనపురం, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలు, 20న స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌ఘడ్, చిల్పూరు, రఘునాథపల్లి మండలాలు, 21న నర్మెట, తరిగొప్పుల, జనగామ అర్బన్, జనగామ రూరల్ మండలాల దివ్యాంగులకు పరీక్షలు చేస్తారని తెలిపారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles