మా భూమిని మాకిప్పించండి

Sat,August 17, 2019 03:04 AM

కొడకండ్ల, ఆగస్టు 16: మండలంలోని గిర్నితండా,మైదం చెరువు తం డా గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 224,348 లోని భూమిని మాజీ ఎంపీటీసీ వెంకట్రామ్, ఆయన సతీమణి అమల అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఆ పట్టాను రద్దు చేయాలని మైదం చెరువు,గిర్నితండా ప్రజలు శక్రవారం స్టేషన్ ఘనపురం ఆర్డీవో రమేశ్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మైదం చెరువు తండా సర్పంచ్ దారవత్ మహేశ్ నాయక్ ,గిర్నితండా సర్పంచ్ రాజ్‌కుమార్ నాయక్,కనకదుర్గ దేవాలయం కమిటీ చైర్మన్ రాజేశ్‌నాయక్, టీజీవీఎస్‌ఎస్ అధ్యక్షుడు సురేశ్‌నాయక్, రెండు గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles