వ్యక్తి ఆత్మహత్య


Sat,September 14, 2019 01:42 AM

రఘునాథపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కంచనపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సురావు రాజేందర్-రజిత దంపతులు తమకు ఉన్న సుమారు నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం వారు సాగుచేసిన సాగుచేస్తున్న పత్తి చేనుకు ఎరువులు, పురుగు మందు పిచికారీ చేయాలని రజిత తన భర్త రాజేందర్‌కు తెలిపింది. దీంతో రేపువేస్తాను ఇవాళ వీలు కాదని చెప్పడంతో రజిత ఇప్పటికే మందులు వేయడం ఆలస్యం అయ్యిందని తప్పని సరిగా మందులు వేయాలని భర్తకు సూచించింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి తగాధా జరిగింది. మనస్తాపానికి గురైన రాజేందర్ చేనులో ఉన్న పురుగుల మందు సేవించి సృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్క రైతులు గమనించి చేను పక్కనే పశువులను మేపుతున్న రజితకు విషయం తెలిపారు. వెంటనే ఆటోలో చికిత్స నిమిత్తం జనగామ ఏరియా దవాఖానకు తరలించగా ఆప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

62

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles