గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర


Sun,September 15, 2019 03:04 AM

దేవరుప్పుల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజ లు ప్రణాళిక పూర్తయ్యే సమయానికి అన్ని గ్రామాలు సర్వ హంగులతో సుందరంగా కనిపించాలని, ఇందుకు సామూహి క కృషి అవసరమని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కోలుకొండ గ్రామాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను వెంటనే కూల్చి చదును చేయాలని, ఇంటి యజమానులు వినకపోతే గ్రామపంచాయతీ ఆ పనులు చేపట్టి యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయాలని సర్పంచ్ కూర్నాల రవికి సూచించారు. వీధులల్లో చెత్త, పిచ్చి చెట్లు కనిపించొద్దని వాటిని శ్రమదానంతో గానీ, గ్రామపంచాయతీ సిబ్బందితో గానీ తొలగించాలని కలెక్టర్ సూచించారు. 30 రోజులు గ్రామపంచాయతీ కార్యవర్గం, అధికారులతో సమన్వయంగా కృషి చేస్తేనే ఇది సాధ్యమౌతుందన్నారు. అవసరమైతే సర్పంచ్ కఠినంగా వ్యవహరించి వినకుంటే వారిపై జరిమానాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, ఉపసర్పంచ్ కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ, కో ఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు...
పాలకుర్తి రూరల్: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని, 30రోజుల గ్రామ ప్రణాళికను సద్వినియో గం చేసుకుని గ్రామాల్లో మార్పు సాధించుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని శాతాపురం గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి జరుగుతున్న పనులపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వాడ వాడలు తిరిగి గ్రామస్తుల సమస్యలు తెలుసుకుంటూ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర అన్నారు. గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యానికి చేరుకుంటామన్నారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని సూచించారు. గ్రామంలో విద్యుత్ స్థంభాలను త్వరగా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. శాతాపురంలో హరితహారంలో ఇంత వరకు మొక్కలు నాటకపోవడంపై ఈజీఎస్ టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు.

మరో వారం రోజుల్లో హరితహారం టార్గెట్ పూర్తి చేయకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నాటిన మొక్కల్లో ఒక మొక్క ఎండినా అధికారులదే బాధ్యత అన్నారు. హరితహారం, గ్రామ ప్రణాళిక పూర్తి చేయకుం టే సర్పంచ్, కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ఎంపీడీవో వీ ఆశోక్‌కుమార్, సర్పంచ్ సుశీల వెంకటేశ్, ఉప సర్పంచ్ రాంబాబు, బిక్షపతి, ఈజీఎస్ పీవో రమేశ్, కార్యదర్శి నాగమణి, సోమనర్సయ్య, కృష్ణమూర్తి, పోశయ్య, యాకయ్య పాల్గొన్నారు.

66

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles