సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి


Sun,September 15, 2019 03:04 AM

పాలకుర్తి : పాలకుర్తిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. శనివవారం సర్పంచ్ వీరమనేని యాకాంతరావుతో పాటు పంచాయతీ పాలకవర్గం కలిసి హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మండలకేంద్రంలో మిగిలిపోయిన రహదారులకు సిమెంట్ రహదారులు, ఊరచెరువు నుంచి గ్రామపంచాయతీ, సినిమా థియేటర్, శాంతినగర్ ప్రధాన చైరస్తా వరకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని విజ్జప్తిచేశారు. ఈవిషయమై మంత్రి ఎర్రబెల్లి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అనంతరం వారికి 30 రోజుల ప్రణాళికలో భాగంగా పలు సూచనలు చేసినట్లు చెప్పారు. దసరా పండుగ నాటికి గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో విరజిల్లాలని మంత్రి సూచించారన్నారు. గ్రామానికి ఏయే అవసరాలు ఉన్నాయో గ్రామసభలు నిర్వహించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతోప్రజల భాగస్వామ్యంతో పాలకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించినట్లు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీటీసీ ఏడవెల్లి పురుషోత్తం, ఉపసర్పంచ్ తరాల చంద్రబాబు, వీరమనేని హన్మంతరావు, మామండ్ల లక్ష్మణ్, కిరణ్‌కుమార్, శివరాత్రి సోమయ్య, అనుముల అంజిరావు పాల్గొన్నారు.


61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles