పోషణ మాసంపై అవగాహన సదస్సు


Wed,September 18, 2019 02:36 AM

జనగామ టౌన్: పోషణ మాసం, బాలల పరిరక్షణ దత్తత అంశాలపై జిల్లా వైద్యులకు జిల్లా సంక్షేమాధికారి జ్యోతిపద్మ ఆధ్వర్యంలో మంగళవారం జనగామ ఎంసీహెచ్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భిణులు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేయించుకోవాలని, పోషకాలున్న ఆహారాలు ఎక్కువగా తీసుకునేలా వైద్యులు అవగాహనలు కల్పించాలని సూచించారు. పుట్టిన శిశువుకు పుట్టిన గంటలోపేలోనే ముర్రుపాలను తాగించాలని తెలిపారు. అనంతరం బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికాంత్ బాలల దత్తత విభాగం ఆన్‌లైన్ విధానంతోపాటు చట్టబద్ధమైన దత్తత విధి విధానాలపై వైద్యులకు వివరించారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, డాక్టర్లు సీహెచ్ రాజమౌళి, ఇన్నమ్మ, సివిల్ సర్జన్ చంద్రమౌళి, ప్రతిదయాల్, రజిని, స్వప్న, ఏసీడీపీవో ప్రేమలత పాల్గొన్నారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles