నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు


Wed,September 18, 2019 02:36 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 17: నిర్లక్ష్యం చేస్తే ఎంతటివారైనా మూల్యం చెల్లించక తప్పదని మండల పంచాయతీ అధికారి మహబూబ్ అలీ హెచ్చరించారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన కిరాణాదారులు కత్తుల కొమురయ్య, పిట్టల గట్టయ్య ఇంటి పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను బయట పడేస్తుండగా, గుర్తించిన మండల పంచాయతీ అధికారి మహబూబ్ అలీ ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై చెత్త వేయడం, ఆరుబయట మలవిసర్జన చేయడం వంటి పనులు చేస్తే జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామస్తులతో కలిసి పలు కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతి ఒక్కరూ 30 రోజుల ప్రణాళికలో అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈవో మోహన్, ప్రత్యేకాధికారి వినయ్‌కుమార్, సర్పంచ్ అజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్ పరశురాములు, ఫీల్డ్ అసిస్టెంట్ కవిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles