రైతు ముంగిట్లోకే పీఏసీఎస్ సేవలు


Wed,September 18, 2019 02:38 AM

నర్మెట, సెప్టెంబర్ 17: పీఏసీఎస్ సొసైటీల ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు రైతుల ముంగిట్లోకే వస్తున్నాయని నర్మెట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ సొసైటీ కార్యాలయంలో డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సొసైటీ సీఈవో కొన్నె వెంకటయ్య అధ్యక్షత వహించగా, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ సీజన్ నుంచి సొసైటీ కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువుల బస్తాలను అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. అదేవిధంగా నర్మెట, తరిగొప్పుల మండలాల్లోన్ని అన్ని గ్రామాలకు సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు రూ.6.98కోట్ల పంట రుణాలను 1192 మంది రైతులకు అందించామన్నారు. విడుతల వారీగా మిగిలిన రైతులకు పంట రుణాలను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్థన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ, గౌస్, సొసైటీ డైరెక్టర్లు గొట్టె వెంకటయ్య, బానోత్ సోమ్లానాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నిరటీ సుధాకర్, టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు గోపగొని రామకృష్ణగౌడ్, ఎంపీటీసీ కల్యాణం మురళీ, ఏసీఈవో ప్రజ్ఞపురం మల్లయ్య, టీఆర్‌ఎస్ మండల నాయకులు చేర్యాల సత్యానారాయణ, వంగాల గోవర్ధన్, గద్దల అమృతరావు, గుడికందుల నరహరి, ప్రజ్ఞపురం అంజయ్య పాల్గొన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles