కిడ్నీ సంబంధ వ్యాధితో యువకుడి మృతి


Thu,September 19, 2019 02:40 AM

-ఎమ్మెల్యే చొరవతో మృతదేహం అప్పగింత
లింగాలఘనపురం, సెప్టెంబరు 18: ్దమండల కేంద్రానికి చెందిన ఒద్ది క్రాంతికుమార్ (34) అనే యువకుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానకు రెండు రోజుల క్రి తం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెం దాడు. క్రాంతి కుమార్ మందులు, చికిత్సలకు సంబంధించి రూ. 1.50 లక్షలు సదరు దవాఖాన యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లిస్తేనే మృదేహాన్ని అప్పగిస్తామని దవాఖాన యాజమా న్యం కుటుంబ సభ్యులతో పేచీకి దిగింది. విషయాన్ని టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, మండల ఇన్‌చార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే రాజయ్య దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు. వారు స్పందించి, యాజమాన్యంతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని, అవసరమైతే ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పిస్తానని సూచించడంతో మృతదేహాన్ని బంధువులకు బుధవారం అప్పగించారు. కాగా, బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ. 5వేల ఆర్థి సాయాన్ని అందించారు. క్రాంతికుమార్‌కు భార్య ధనలక్ష్మి, కుమారులు వరుణ్ కుమార్, చరణ్ కుమార్ ఉన్నారు. పిల్లల చదువుల కోసం సాయమందిస్తానని జెడ్పీటీసీ చెప్పారు. వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, మండల ఇన్‌చార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి తదితరులున్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles