విద్యుదాఘాతంతో 27 గొర్రెలు మృత్యువాత


Thu,September 19, 2019 02:40 AM

లింగాలఘనపురం, సెప్టెంబరు 18: సిరిపురంలో దాయ శ్రీనివాస్‌కు చెందిన 27 గొర్రెలు బుధవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో మృతిచెందాయి. బాధితుడి కథనం ప్రకారం.. తన ఇంటి సమీపంలో గొర్రెలకు పాక ఏర్పాటు చేసి, రోజూ రాత్రి వేళలో అందులో గొర్రెలను తోలుతున్నాడు. మంగళవారం రాత్రి కురిసిన వాన, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి గొర్రెలపై పడ్డాయి. దీంతో 27 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. బాధితుడిని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్ బుధవారం పరామర్శించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెంట జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, మర్రి భాస్కర్‌రెడ్డి, కొత్తకొండ గంగాధర్, దాయ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles