తెలంగాణ సంస్కృతికి ప్రతీక బొడ్డెమ్మ


Thu,September 19, 2019 02:44 AM

-ప్రారంభమైన వేడుకలు
-వారం రోజులపాటు ఆడపడుచుల ఆటపాటలు


బాయి బొడ్డెమ్మ..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బాయిల బొడ్డెమ్మను జరుపుకోవడం ఆనవా యితీగా వస్తోంది. దీని కోసం చిన్న గుంత తవ్వి చుట్టూ నాలుగు దిక్కులా, నాలుగు గద్దెలు ఏర్పాటు చేస్తారు. పూలతో అందంగా అలంకరించి మధ్యన వెంపలి మొక్కను నాటుతారు. తర్వాత చుట్టూ ఉన్న గద్దెలపై పూలు చల్లుతూ, పాటలు పాడుతారు. చివరి రోజున ఆ పూలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

పందిరి బొడ్డెమ్మ..
కొన్ని ప్రాంతాల్లో పందిరి బొడ్డెమ్మగా విభిన్నంగా జరుపుకుంటారు. ఇంటి ఎదుట సీతాఫల కొమ్మలు, ఆకులతో చిన్న పందిరి వేసి ఆ పందిరిలోపలివైపు కప్పునకు సీ తాఫలకాయను, మొక్కజొన్న కంకిని వేలాడదీస్తారు. తర్వాత వాటి కింద అలికి ము గ్గువేసి పుట్ట మన్నుతో తయారుచేసిన బొడ్డెమ్మను ప్రతిష్ఠిస్తారు. పూలతో అలంకరించి న పసుపు గౌరమ్మను అందులో పెడుతారు. అనంతరం తొమ్మిది రోజులపాటు అ మ్మాయిలు ఆనందంగా ఆడిపాడుతూ ఉత్సవాలు జరుపుకుంటారు.

గుంట బొడ్డెమ్మ..
మనిషి అడుగు పడని చోట ఒక గుంటను తవ్వుతారు. తర్వాత దాని చుట్టూ మళ్లీ ఐదు చిన్నగుంటలు ఏర్పాటు చేస్తారు. ఈ గుంటలన్నీ పూలతో అలంకరిస్తారు. మధ్య న ఉన్న ప్రధాన గంటలోని పూలను అలాగే ఉంచుతారు. నాలుగు దిక్కులా ఉన్న గుంటల్లోని పూలను మాత్రం తీసి కొత్త పూలు వేస్తూ పాటలు పాడుతారు. చివరి రో జు గుంటలోని పూలన్నీ తీసి ఒక పాత్రలో వేసి తీసుకువెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు.

బొడ్డెమ్మ ప్రసాదం..
ఆటలు ఆడిన తరువాత పప్పు, బెల్లం నైవేద్యంగా పెట్టి బొడ్డెమ్మను నిద్రపు చ్చుతారు. బొడ్డెమ్మను నిద్రపుచ్చే క్రమంలో పాడే పాటలు తెలంగాణ సంస్కృతికి ప్ర తీకగా నిలుస్తాయి. బొడ్డెమ్మ పండుగ జరుపుకునే కాలంలోనే అనుములు, పెసర్లు, మొక్కజొన్నలు పండుతాయి. ఈ ధాన్యాల పేర్లన్నీ బొడ్డెమ్మ పాటల్లో కనిపిస్తాయి. శివుడి భార్యలైన గంగ, గౌరీల కలహాలు కూడా పాటలకు ప్రధాన వస్తువులుగా ఉం టాయి.

బావిలో నిమజ్జనం..
ప్రతి రోజు ఆటలు ఆడుకున్న తర్వాత బొడ్డెమ్మను బావిలో నిమజ్జనం చేస్తారు. దీన్ని బొడ్డెమ్మ బాయిల పడ్డది అని అంటారు. చివరి రోజున కలశంలో పోసిన బి య్యాన్ని బెల్లం కలిపి పరమాన్నం వండుతారు. అందరు ప్రసాదంగా స్వీకరిస్తారు. పెండ్లీడు అమ్మాయిలు ఈ రవిక బట్టను ధరించడం ఆచారంగా వస్తోంది.

బొడ్డెమ్మ తయారు విధానం..
చెరువు నుంచి తెచ్చిన రేగడిమట్టితో లేకుంటే పుట్టమన్నుతో పీటపై బొడ్డెమ్మను తయారు చేస్తారు. కొందరు వలయాకారంలో ఐదు దొంతరులుగా, మరికొందరు చ తురస్రాకారంలోనూ తయారు చేస్తారు. తర్వాత ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టి పూలతో అలంకరిస్తారు. చివరిభాగంలో కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. క లశంపై రవిక చుట్టి తమలపాకులో పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఈ బొడ్డెమ్మను రుద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి, దేవుడి గదిలో ఉంచి పూజిస్తారు. సాయంత్రం వాకిట్లో అలుకు చల్లి, చుక్కల ముగ్గు వేసి బొడ్డెమ్మను పెట్టి పాటలు పాడుతూ ఆడుతారు. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకం కాగా.. బొ డ్డెమ్మ బాలికలకు మాత్రమే ప్రత్యేకమైనది.

93

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles