అన్ని రంగాల్లో రాణించాలి రిటైర్డ్ డీజీపీ ఎస్‌కే జయచంద్ర


Fri,September 20, 2019 02:27 AM

నిట్‌క్యాంపస్, సెప్టెంబర్ 19: వరంగల్ నిట్‌లో చదివే విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేందుకు విశేష కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ ఎస్‌కే జయచంద్ర అన్నారు. గురువారం రాత్రి నిట్ ఆడిటోరియంలో స్టూడెంట్ కౌన్సిల్ అండ్ క్లబ్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌కే జయచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి క్లబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వారిలోని ప్రత్యేక నైపుణ్యాలు క్లబ్‌ల్లో జరిగే ఈవెంట్ల ద్వారా వెలుగులోకి వస్తాయని తెలిపారు. విద్యార్థి నాయకులు తోటి వారిని ప్రభావితం చేసేలా ఉన్నతంగా ఉండాలని సూచించారు. మంచి విద్యా వాతావరణం ఉన్న నిట్‌లో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ వరంగల్ నిట్‌లో స్టూడెంట్ క్లబ్‌లు, కౌన్సిల్ విద్యార్థులు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టెక్నోజియాన్, స్ప్రింగ్‌స్ప్రీ ఈవెంట్లలో విద్యార్థుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ జీయన్‌రావు, స్టూడెంట్ డీన్ ఎల్‌ఆర్‌జీరెడ్డి, డీన్ కేవీ జయకుమార్ పాల్గొన్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles