పరిసరాల పరిశుభ్రత పాటించాలి జెడ్పీ సీఈవో రమాదేవి


Fri,September 20, 2019 02:28 AM

జఫర్‌ఘడ్, సెప్టెంబర్ 19: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలను శుభ్రం చేసేందుకు సమష్టిగా పాటుపడాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి రమాదేవి సూచించారు. మండలంలోని కోనాయిచలంలో గురువారం ఆమె ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లను తొలగించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ సర్కార్ ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని ప్రధాన సమస్యలు గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంపత్‌రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సుకన్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles