వైద్య సిబ్బంది అలర్ట్‌గా ఉండాలి


Fri,September 20, 2019 02:28 AM

జనగామ టౌన్ : సీజనల్ వ్యాధులపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి జిల్లా వైద్యులను ఆదేశించారు. గురువారం జిల్లా ప్రధాన దవాఖానలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దవాఖానలోని ఓపీ రికార్డులతో పాటు రోగులకు వైద్యులు అందిస్తున్న వైద్యసేవలపై ప్రత్యేకంగా ఆరాతీశారు. అదేవిధంగా ఇటీవలే నమస్తేతెలంగాణ పత్రికలో ప్రచురితమైన పలు కథనాలపై దవాఖాన పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. కాగా సీటీ స్కాన్, ప్లేట్‌లెట్ పరికరాలను మరమ్మతు చేయించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కాగా దవాఖానలోని బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రోగులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ దవాఖానలోని పాలియేటివ్ కేర్ సేవా కేంద్రాన్ని మాతాశిశు ఆరోగ్యకేంద్రానికి తరలించేందుకు సన్నాహలు చేస్తున్నట్లు కలెక్టర్ వారికి వివరించారు. ప్రభుత్వ దవాఖాన సేవలను నమ్ముకుని వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందించాలన్నారు. కాగా సీజనల్ వ్యాధులతో వస్తున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించి వారికి రోగ నివారణకు కావాల్సిన ఔషధాలే కాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా తెలియపర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్తె చెవి నొప్పితో బాధపడుతుంగా ప్రభుత్వ దవాఖానల్లో ఈఎన్‌టీ డాక్టర్ మహేశ్‌తో చికిత్స చేయించారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles