ములుగు డీపీఆర్‌వో శ్రీనివాస్‌రావు మృతి


Fri,September 20, 2019 02:32 AM

-గూడెప్పాడ్ వద్ద రోడ్డు ప్రమాదం
-విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన
-మరో నలుగురికి గాయాలు
-సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు


జనగామటౌన్, సెప్టెంబర్ 19 : అతివేగానికి తోడు మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతున్నది. గడిచిన తొమ్మిది మాసాల్లో తాజాగా దేవరుప్పుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో కలిపి మొత్తంగా 245 ప్రమాదాలు జరిగాయి. కాగా 84 మంది మృత్యువాతపడ్డారు. మరో 259 మంది గాయపడ్డారు. కాగా పోలీస్ యంత్రాంగం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎంత శ్రమించినా ఫలితం దక్కడం లేదు. వాహనాల స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు మూడు మాసాల క్రితం నుంచి జనగామ వెస్ట్ జోన్ వ్యాప్తంగా స్పీడ్‌గన్స్ ద్వారా 5,636 వాహనాలకు రూ.58,27,058 లక్షల జరిమానా సైతం విధించారు. అంతేగాక ప్రమాదాలను అరికట్టి, ప్రాణనష్టాన్ని తగ్గించడంపై ప్రత్యేకంగా రాంగ్, ర్యాష్ డ్రైవింగ్ వాహనాదారులకు కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా సైతం విధిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ట్రిపుల్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లను నివారించి ప్రతీ ఒక్కరు హెల్మెట్ లేకుండా వాహనాలను నడపకూడదనే ఆలోచనలో పోలీసులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇలా అనేక మంది రోడ్డు ప్రమాదాల బారీన గురవుతూ కాళ్లు, చేతులు విరిగి అచేతన స్థితిలోకి వెళ్తున్నారు. మరి కొందరు మృతి చెందడంతో ప్రజా సంఘాలు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అనేకమంది వివిధ రకాల కారణాలకు గురై మృతి చెందుతున్నారు. అసలు ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని అనేక సార్లు హెచ్చరికలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాలపై స్పందించక పోవడంతో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలువురు వాపోతున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ల వల్ల ప్రయోజనమెంత అనే దానిపై జిల్లాలో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. రోడ్డు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్న సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ సిగ్నల్స్ పడితే ఆగాలనే నిబంధనను కూడా సగానికి పైగా వాహనదారులు పాటించడం లేదని తెలుస్తున్నది. జిల్లాలో నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో యువత బైక్‌లపై ట్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగా కూడా ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. కాగా మరో వారంలో పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రానున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోను మున్సిపల్ అధికారులు పలు మెయిన్ రోడ్డుకు వెళ్లే ఆయా ప్రాంతాల ప్రధాన కూడళ్లలో స్పీడ్ బేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, గుంతల రోడ్లను మరమ్మతులు చేపట్టి మూలమలుపుల వద్ద గుర్తింపు, సూచనలు, రేడియం స్టిక్కర్లు అంటిస్తే చిన్న చిన్న చర్యలు తీసుకుంటే సైతం కొంత మేరకు ప్రమాదాలను నివారించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

అంతేకాకుండా రోడ్డు రవాణా, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా నిర్ధేశించిన సమయం ప్రకారం భారీ వాహనాలు జిల్లా కేంద్రం నుంచి వెళ్లేందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ లారీలు, టిప్పర్లు, ఇతరత్ర భారీ వాహనాలు సమయపాలన లేకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక రాత్రివేళల్లో అయితే ఇసుక లారీల డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను అతివేగంగా నడుపుతూ వెళ్తున్నారు. ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదాలకు కారకులవుతున్నారు. లారీ డ్రైవర్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతైనా ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలను వెంటనే తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles