భూకబ్జాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు


Sat,September 21, 2019 02:23 AM

వరంగల్ క్రైం, సెప్టెంబర్ 20 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూదందాలకు పాల్పడుతూ.. భౌతిక దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఠాణాల వారీగా అధికారుల పనితీరుతో పాటు కేసుల నమోదు, నిందితుల అరెస్టుపై ఒక్కో అధికారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పలు విషయాలను అడిగారు. అనంతరం సీపీ రవీందర్ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. నర్సంపేట, పర్కాల, జనగామ, వరంగల్ ట్రైసిటీలోని భూకబ్జాదారులపై నిఘా పెట్టాలని, అలాంటి వ్యక్తుల ఆగడాలు కొనసాగకుండా కళ్లెం వేయాలన్నారు. భూదందాల్లో భౌతికదాడులకు పాల్పడే వ్యక్తులపై రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. శాంతిభద్రతలు తీరుతెన్నుల గురించి స్టేషన్ అధికారులు కాలనీలల్లో ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు. నిందితులు పట్టుబడినప్పడు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిందితులు గతంలో నేరాలకు పాల్పడ్డారా లేదా అని తెలుసుకోవాలని సూచించారు. పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది స్టేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయాలని, ప్రతీ ఏరియాలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని క్రైం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.


నేరస్తులను తక్షణమే గుర్తించేందుకు కేసు విచారణలో భాగంగా స్టేషన్ అధికారులు క్లూస్ విభాగం సహకారం తీసుకోవాలని కోరారు. స్టేషన్ రిసెప్షన్ సెంటర్ పనితీరుపై స్టేషన్ అధికారితో పాటు అడ్మిన్ ఎస్సై పర్యవేక్షణ ఉండాలన్నారు. పోలీస్ వెబ్ అప్లికేషన్స్‌పై కింది స్ధాయి సిబ్బంది నుంచి అధికారి వరకు అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టేషన్లలో పనిచేసే సిబ్బందితో పాటు ప్రత్యేక విభాగాల్లో పని చేసే వారికి వారంతపు సెలవులను ఖచ్చితంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. గణేశ్ నవరాత్రులను విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందికి అధికారులకు సీపీ రవీందర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కే ఆర్ నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, అడిషినల్ డీసీపీ భీంరావు, అడిషినల్ ఎస్పీలు చక్రవర్తి, సునీతామోహన్, శ్రీనివాసులు, ఏసీపీలు జనార్దన్, వెంకటేశ్వర్‌బాబు, బోనాల కిషన్, శ్యాంసుందర్, శ్రీధర్, సదానందం, నర్సింగ్‌రావు, నర్సయ్య, బాబురావు, శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌రావు, సతీశ్‌బాబు, శ్రీనివాస్, సుజాత, జీవన్‌రెడ్డి, రమేశ్‌కుమార్, కిషోర్‌కుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్‌జీ, గొర్రె మధు, స్వామి, శ్రీధర్‌రావు, ఆర్‌లు భాస్కర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles