ఆరోగ్య తెలంగాణే అందరి లక్ష్యం


Sat,September 21, 2019 02:24 AM

-జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ
జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 20 : ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, విద్యార్ధినులు పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ అన్నారు. శుక్రవారం పోషణ అభియాన్ జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనగామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ కాలేజీ, శ్రీవిద్య కాలేజీ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రక్తహీనతతో కలిగే నష్టాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి రవికాంత్ మాట్లాడుతూ బాలల హక్కుల సమస్యలను పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1098పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యకమంలో జిప్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles