ఆధునిక వైద్యంపై అలర్ట్‌గా ఉండాలి


Sat,September 21, 2019 02:25 AM

పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 20: వైద్యరంగంలో మార్పులకు అనుగుణంగా వైద్య విద్యార్థులు చురుకుగా ఉంటూ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సీటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఈ నెల 20 నుంచి 29 వరకు ఉత్కర్ష కార్యక్రమాలను శుక్రవారం కేఎంసీలోని ఎన్‌ఆర్‌ఐ భవనంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు చదువుతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా ఫైనలీయర్ విద్యార్థులకు మరో మూడు నెలల్లో పరీక్షలు జరుగనున్నందున చదువుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్సులు పూర్తి చేసి వైద్య విద్యలో రాణించాలని సూచించారు.


ఇదే క్రమంలో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే వైద్యరంగంలో వివిధ పరిశోధనలు చేస్తూ ఆధునిక వైద్యం అందే దిశలో పయనించాలని సూచించారు. వైద్య వృత్తిలో అంకిత భావంతో పనిచేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా కాకతీయ మెడికల్ కళాశాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ.. పదిరోజుల పాటు జరుగనున్న వివిధ పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా మెడ్‌ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్విజ్, వైద్య విద్యకు సంబంధించిన చార్ట్‌లను ప్రదర్శించారు. అలాగే సింపోజియం కార్యక్రమంలో భాగంగా ఐదుగురు మెడికోలు స్టేజిపై ఉండి ఒక టాపిక్‌పై సుధీర్ఘంగా మాట్లాడుతూ విద్యార్థులకు వివరించారు. ముందుగా మెడికోల స్వాగత నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles