విద్యార్థులు వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవాలి


Sat,September 21, 2019 02:27 AM

-పోటీతత్వంతో ముందుకు సాగాలి
-కేహెచ్‌యూ వీసీ కరుణాకర్‌రెడ్డి
-కేఎంసీలో ఉత్కర్ష సంబురాలు
-ఈ నెల 29వరకు వేడుకలు


మడికొండ, సెప్టెంబర్ 20: క్రీడాకారులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహాన్ని అందించాలని అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి, పదో తరగతి విద్యార్థి తౌటం సంజన ధృతి తెలిపారు. కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం 13వ వార్షిక క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యాలయ స్కౌట్స్ అండ్ గౌడ్స్‌తో పాటు స్టార్(శివాజీ, ఠాగూర్, అశోక, రామన్) సదనములచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంజన ధృతి మాట్లాడారు. క్రీడలు మన జీవితంలో ఒక భాగం మాత్రమేనని చెప్పారు. మా తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ప్రోత్బలంతోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలిగానని అన్నారు. మహాభారతంలో అర్జునుడితో స్ఫూర్తి పొంది విలువిద్యలో రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడల్లో శివాజీ సదనం ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా నిలువగా వారికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. అలాగే ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను అందజేశారు. అంతకుముందు చిన్నారులకు నిర్వహించిన క్రీడలు అలరించాయి. కార్యక్రమంలో పీఈటీ కొర్ర శ్రీనివాస్, కోచ్ మహేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles