వాహనదారులు నిబంధనలు పాటించాలి


Mon,September 23, 2019 07:20 AM

జనగామ టౌన్, సెప్టెంబర్ 22: రోడ్డు భద్రతా నిబంధనలు పా టించాలని జనగామ పోలీసులు వాహనదారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జనగామ టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారితోపాటు ట్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై దృష్టి సారించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి పలువురికి భారీగా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్‌నాయక్, రవికుమార్‌తో పాటు పలువురు జనగామ ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles