బతుకుదెరువు కోసం వెళ్లి.. కానరాని లోకాలకు..


Mon,September 23, 2019 07:20 AM

నర్మెట, సెప్టెంబర్ 22: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి.. రోజువారీ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తుండగా, అక్కడ ఓ బిల్డింగ్‌పై సెంట్రింగ్ బాక్సులు మీదపడి జిల్లా వాసి మృతిచెందిన ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. మృతుడి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కథనం ప్రకారం.. నర్మెట మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివగారి శంకరయ్య (42) బతుకు దేరువు కోసం కొద్ది కాలం క్రితం హైదరాబాద్‌కు కుటుంబంతో సహ వెళ్లి అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం భవన నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సెట్రింగ్ బాక్స్‌లు ప్రమాదవశాత్తు శంకరయ్య మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు స్వగ్రామమైన వెల్దండకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. కాగా శంకరయ్యకు కూతురు తలకొరివి పెట్టింది. ప్రభుత్వం శంకరయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని సంఘం నాయకులు బైరగోని మనోహర్, భాస్కర్, ఆంజనేయులు, యాదగిరి, భరత్, సత్యనారాయణ, శ్రీను, సాంబయ్య, రవి తదితరులు కోరారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles