పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అండ

Thu,July 11, 2019 05:38 AM

గణపురం, జూలై 10 : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో నగదు సాయం అందిస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలున్న కొందరు తల్లిదండ్రులు భారంగా భావించి బాల్యవివాహాలు చేస్తూ బాధ్యతలను తొలింగించుకుంటున్నారని అన్నారు. ఇలా ఎంతో మంది పేదలు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ బాల్య వివాహాలను అరికట్టి నిరుపేదలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చెక్కుల పంపిణీ చేయాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ కార్యక్రమం వాయిదా వేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా 67 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు 61లక్ష 35వేల 424రూపాయల చెక్కులను అందజేశారు.

పాస్ పుస్తకాలను త్వరగా అందించాలి..
పెండింగ్‌లో ఉన్న పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీపై సమయం కేటాయించి రైతులకు త్వరగా అందించాలని ఎమ్మెల్యే రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రైతులను ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత..
మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ హరిత విప్లవం సాధించాలని యోచిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రతీ ఇంటి ముందు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. తహసీల్దార్ దేవుళ్లపల్లి సమ్మయ్య, సర్పంచ్‌లు నారగాని దేవేందర్‌గౌడ్, తోట మానస శ్రీనివాస్, నగేశ్, రవి, భద్రయ్య, మంజుల, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్‌గౌడ్, సుదర్మ, చెన్నూరి రమాదేవి, అశోక్‌రెడ్డి, సరస్వతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దివి ప్రసాద్‌నాయుడు, ఐలోని రాంచంద్రారెడి,్డ లక్ష్మీనర్సింగరావు, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, బత్తిని శంకర్, మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బోయిని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles