చర్ల ఘటనతో హై అలర్ట్..!

Sun,July 14, 2019 01:45 AM

ములుగు, నమస్తేతెలంగాణ : వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ తప్పని సరిగా లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు కలిగి ఉండాలని ములుగు డీఎస్పీ విజయసారథి అన్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీఐ సార్ల రాజు ఆధ్వర్యంలో ములుగు, వెంకటాపూర్ ఎస్సై లు బండారి రాజు, భూక్య నరహరి తమ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. 84 ద్విచక్రవాహనాలతో పాటు 1ఫోర్ వీలర్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని ప్రధాన కూడలికి తీసుకువచ్చి వాహనాలను ధృవపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనం కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తప్పని సరిగా లైసెన్స్‌తో పాటు పూర్తి కాగితాలు కలిగి ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని, ఎవరైన తారసపడినట్లయితే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.

వాజేడులో..
వాజేడు : భద్రాద్రికోత్తగూడెం జిల్లాలోని చర ్లమండలంలోని బెస్తా కొత్తూరు టీఆర్‌ఎస్ ఎంపీటీసీని మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్యచేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో హైలర్ట్ ప్రకటించారు. మండలంలోని టేకులగూడెం గ్రామ శివారులో ఉన్న హైదరాబాద్-భూపాలపట్నం (163)జాతీయ రహదారిపై శనివారం పేరూ రు ఎస్సై ఆర్ స్వామి నేతృత్వంలో వాహనాల తనిఖీ చే పట్టారు. అదేవిధంగా జగన్నాథపురం వై జంక్షన్‌లో వాహనాలు ఆపి వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ తో పాటు భద్రాచలం, వెంకటాపురం, వరంగల్, ఏటూరునాగారం తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలను క్షుణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. వాహనాలను నడిపే వారితోపాటు లైసెన్స్‌లు, బీమా తదితర పత్రాలను పరిశీలించి, తప్పనిసరిగా పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం : ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గొత్తికోయ గూడేల్లో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా సోదాలు చేపట్టారు. ఎస్సైలు యాసిర్ అరాఫత్, పోగుల శ్రీకాంత్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అపరిచత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వ కూడదని సూచించారు. ఏటూరునాగారం మండలం సండ్రగూడెం గొత్తికోయ గూడెం, కన్నాయిగూడెం మండలం కొత్త నీలంపల్లి గొత్తికోయగూడెంలో ఆయా ఎస్సైలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గొత్తికోయలతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎస్సైలు మాట్లాడుతూ మావోయిస్టులకు సహకరించొవద్దని, అపరిచిత వ్యక్తుల సంచారం ఉంటే వెంటనే తమకు సమాచారం అందచేయాలని ఎస్సైలు ఆదేశించారు. చర్ల ఏరియాలో టీఆర్‌ఎస్ నాయకుడిని మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.


మంగపేటలో..
మంగపేట: మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఎస్సై గొత్తికోయలకు సూచించారు. మండలంలోని ప్రాజెక్టు నగర్ గొత్తికోయల గూడాన్ని ఎస్సై పోలీసు బృందాలతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గొత్తికోయలకు పలు సూచనలు చేశారు. గూడాల్లోకి అపరిచిత వ్యక్తులు వస్తే తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. సమస్యలుంటే అధికారుల సహాయం పొందాలి తప్ప నక్సల్స్‌ను ఆశ్రయించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.

వెంకటాపురంలో..
వెంకటాపురం(నూగూరు): మండల పరిదిలోని కొండాపురం గ్రామంలో పోలీసులు ఎస్సై తిరుపతి నేతృత్వంలో సీఆర్‌పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలు అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles