గులాబీ వనంలో చేరాలి

Sun,July 14, 2019 01:49 AM

భూపాలపల్లి, నమస్తే తెలంగాణ : వచ్చే ఎన్నికల్లో భూ పాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే ఎజెండాగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖులు పిలుపునిచ్చా రు. శ నివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫం క్షన్ హాల్‌లో భూపాలపల్లి పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం అర్బన్ అధ్యక్షుడు కాత్యరాజు సాం బమూర్తి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాజ్యసభ స భ్యులు బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర వికలాంగుల అభివృ ద్ధి సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ జ క్కు శ్రీహర్షిణి హాజరై ప్రసంగించారు.

తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసం సీఎం పనిచేస్తున్నారు : ఎంపీ బండా ప్రకాశ్
తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని కూడా ఒక్క ఉద్యమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుకు తీసుకువెళ్తున్నారని, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్ పార్టీ భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి బండా ప్రకాశ్ అన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్‌లో టీఆర్‌ఎస్ భూపాలపల్లి పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై పా ర్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ లో ఉ న్న 30కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయని, వాటన్నింటిని గెలుచుకునే దిశగా నాయకులు, కా ర్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే ఎజెండాగా పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ము న్సిపాలిటీలో 30స్థానాల్లో సగం మహిళలకే రిజర్వేషన్ వస్తాయన్నారు. టీ ఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అగ్రగామి గా నిలిచినవారే పా ర్టీకి ప్రథములుగా ఉంటారన్నారు. కొత్త, పాత తేడాలేకుండా అందురు కలిసికట్టుగా పనిచేసినప్పుడే విజయాన్ని అందుకుంటామని, ఆ దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ప థకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లోనే పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతీ వార్డులో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం వెయ్యి లక్ష్యంగా పెట్టుకొని సభ్యత్వ నమోదు చేయాలన్నా రు. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం కే సీఆర్ రూ.27కోట్ల నిధులు మంజూరు చేశారని, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకునే ప్రక్రియ చేపడుతున్నామన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ స్థానాలన్నింటినీ టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకునే విధంగా సమిష్టిగా పనిచేయాలని అన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతీ లబ్ధిదారుడిని కలిసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసిన అభ్యర్థిని గెలిపించటానికి కృషిచేసిన వారికి అంతకంతకు అవకాశాలు పార్టీ కల్పిస్తుందన్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం రాకుంటే నిరాశ పడవద్దని అన్నారు. ఈ నెల 19 సాయంత్రం వరకు పార్టీ సభ్యత్వ నమోదు చేసిన పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేయాలని, 20 నుంచి పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు.

సభ్యత్వ నమోదులో సత్తా చాటాలి..
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులు తమ సత్తా చాటాలి. పార్టీ నిర్మాణం లో ముందున్న వారందరికి తప్పక గుర్తింపు ఉం టుంది. కలిసికట్టుగా పనిచేసి భూపాలపల్లి మున్సి పాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో ప్రయోజనం పొందిన ప్రతీ లబ్ధిదారుడి పార్టీ శ్రేణులు కలవాలి. పార్టీ క్రియాశీలక, సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టి, సభ్యత్వ నమోదులో ముందున్న వారికే పార్టీ గుర్తింపునిస్తుంది. సమిష్టిగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలి.
- రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి

పార్టీ పటిష్టతకు పని చేయాలి..
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
టీఆర్‌ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ప్రజలకు దగ్గరగా ఉన్నవారికే భూపాలపల్లి మున్సిపాలిటీలో పోటీచేయడానికి అ వకాశాలు వస్తాయి. పాత, కొత్త తేడాలు ఏమీ ఉండవు.. ఎవరూ అధైర్యపడాల్సిన అవస రం లేదు.. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికే అవకాశాలు తలుపుతడతాయి.. మున్సిపాలిటీలోని 30 కౌన్సిలర్ స్థానాలన్నింటిల్లో గులాబీ జెండాను ఎగురవేసే వి ధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం రానివారికి నామినేటెడ్ పదవులు వస్తాయి. గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీ, నియోజకవర్గంలో స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు అయ్యాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నాము. పార్టీ స భ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలి. పార్టీ సభ్యత్వమే కొలమానంగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కలిసికట్టుగా సాగి నియోజకవర్గాన్ని, పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరుచుకుందాం. కొద్దిరోజుల్లోనే పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుంది. అదే విధంగా భూపాలపల్లిలో వ్యవసాయ మార్కెట్ కూడా త్వరలోనే రాబోతుంది.

త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు..
దేశం, ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయబోతుంది. పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌కార్డు నంబర్, సెల్‌నంబర్ తప్పక నమోదు చేసుకోవాలి. సెల్‌నంబర్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల సంక్షిప్త సమాచారం వస్తుం ది. టీఆర్‌ఎస్ అధినేత నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికే పార్టీ ఈ టోల్‌ప్రీ నంబర్ ఏర్పాటు చేస్తుంది. కార్యకర్తలకు ఇబ్బందులు వస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సంబంధిత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు సమాచారం చేరవేసి సమస్యలను పరిష్కరించటం జరుగుతుంది. పార్టీ పటిష్టత కోసం 32 జిల్లాలకు 32 జిల్లా కార్యాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టాం. పాత, కొత్త తేడా లేదు. మనమంతా ఒక్క కుటుంబమే. మనస్పర్థలు పెట్టుకోకుండా నిబద్ధతతో పనిచేయాలి. రాష్ట్రంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30కౌన్సిలర్ స్థానాలకు 30గెలుచుకొని ప్రథమంగా నిలుపాలి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కలయిక భూపాలపల్లి పట్టణ, నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుంది. భూపాలపల్లి పట్టణ, నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. పార్టీ జెండా మోసి, పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అవకాశం తప్పక వస్తుంది.
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

గత ఎన్నికల స్ఫూర్తితో పనిచేయాలి..
గత అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి విజయా న్ని అందించారు. అదే స్ఫూర్తితో పనిచేసి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలి. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేకూర్చే అనేక సంక్షే మ పథకాలను చేపట్టి అమలు చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్ర మాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది.
- జిల్లా చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి

కార్యకర్తలే కథానాయకులు..
టీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు. పార్టీ, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన వారికి అవకాశాలు వాటికవే వస్తాయి. ఆలస్యం జరిగినా అన్యాయం మాత్రం జరగదు. ఎవరైనా తొందరపడితే వారే నష్టపోవడం ఖా యం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత చూసి ఇతర పార్టీల్లో అంతర్మథనం మొదలైంది. మున్సిపల్ ఎన్నిక ల్లో అందరూ ఒక తాటిపై నడవాలి. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30కి 30 స్థానాలు గెలుపొందాలి. ఏ ఒక్క స్థానం జారవిడుచుకున్నా అక్కడి నాయకులు, కార్యకర్తలదే లోపంగా భావించాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నేత. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత పరిపాలన సౌలభ్యాన్ని కలిగించారు. రాజకీయాల్లో నిబద్ధత, సేవానిరతి ఉన్న వారికి అవకాశాలు తప్పక వస్తాయి. ఇందుకు బండ ప్రకాశ్ ఉదాహరణగా నిలిచారు. విద్యార్థి దశలోనే వరంగల్ మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పనిచేసిన బండ ప్రకాశ్‌కు చాలా యేళ్ల తరువాత అవకాశం వచ్చింది. బండ ప్రకాశ్ నిబద్ధతను, నిజాయితీని గుర్తించిన సీఎం కేసీఆర్ పార్టీలో చేర్చుకుని రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. పార్టీలో అవకాశాలు రాలేదని తొందరపడితే తదనంతరం కష్టాలు పడటం ఖాయం. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జిల్లా అభివృద్ధితో ముడిపడి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జిల్లా ఉంటదో..? పోతదో..? అనే అనుమానాలు ఉండేవి. అవి ఇప్పుడు పటాపంచలయ్యాయి. సంపూర్ణ న్యాయం, అభివృద్ధి జరగాలంటే 30కి 30 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పటిష్టతకు నా వంతు కృషి చేస్తాను. అభ్యర్థుల ఎంపికలో అందరి సలహాలు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి.
- మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles