చెరువు మట్టి అక్రమ రవాణా

Mon,July 15, 2019 02:28 AM

- అంబట్‌పల్లి ఫారెస్ట్ చెరువులో తవ్వకాలు
- మామూలుగా తీసుకున్న అటవీశాఖ అధికారులు


మహదేవపూర్, జూలై 13 : మండలంలోని అంబట్‌పల్లి గ్రామ శివారులో గల ఫారెస్ట్‌లో చెరువు శిఖం మట్టిని మింగుతున్నారు. రాత్రికి రాత్రే ఇష్టారీతిగా తవ్వుతూ తమ అక్కసును వెల్లగక్కారు. ఇదేంటని ప్రశ్నించేవాళ్లు లేకపోవడంతో తాము ఆడిందే ఆటగా కొనసాగింది.అంబట్‌పల్లి గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన పలుకుబడిని ఉపయోగించి ఏకంగా చెరువుశిఖం భూమికే గురిపెట్టాడు. తన పదవిబలంతో అందరిని మచ్చిక చేసుకుని రెండ్రోజులుగా ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తూ తన నైజాన్ని ప్రదర్శించుకున్నాడు. ఇందేంటని ప్రశ్నించేవాళ్లు లేకపోవడంతో అంతా నాఇష్టం అంటూ దర్జాగా మట్టిని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంబట్‌పల్లి శివారులోని చెరువు శిఖం భూమిలో రెండు రోజుల క్రితం ప్రొైక్లెన్‌తో రాత్రికిరాత్రే ట్రాక్టర్ల ద్వారా మట్టిని తన అనుచరుల కోసంతో పాటు తన సొంత అవసరాల కోసం తనరలించినట్లు సమాచారం. ఎవరైనా పేద రైతులు తమ పంట పొలాల్లోకి మట్టి అవసరాలకు తీసుకెళ్లాలని యత్నిస్తే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే అటవీశాఖ అధికారులు ఇప్పుడూ సదరు ప్రజాప్రతినిధి అవసరాలకు తరలిస్తుంటే తమకేం తెలియనట్లు వ్యవహరించడంతో సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తుల కళ్లెదుటే దర్జాగా ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుంటుండగా తమకేం పట్టనట్లుగా అటవీశాఖ అధికారులు ఉన్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మట్టి తరలింపుపై అదే రోజు అటవీశాఖ అధికారులకు ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదని, అక్రమ మట్టి తవ్వకాలు అధికారుల కనుసన్నలోనే జరగాయంటూ పలువురు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు మామాలుగా తీసుకోవడం వల్లే ఇలా దర్జాగా మట్టి తవ్వకాలు జరిగాయని సదరు అటవీశాఖ అధికారులపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మహదేవ్‌పూర్ అటవీశాఖ రేంజ్ అధికారి జగదీశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా అక్రమ తవ్వకాలు జరిగినట్లు తన దృష్టికి రాలేదని ఫారెస్ట్ చెరువు శిఖం భూముల్లో తవ్వకాలకు అనుమతులు లేవని వెల్లడించారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles