లెక్క తేలింది !

Wed,July 17, 2019 04:18 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వా ర్డుల విభజన, ఓటర్ల కుల గణన లెక్క తేలింది. వార్డుల వారీగా ఓటర్లు, వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల తుది జాబితా మంగళవారం విడుదలైం ది. భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తుది జాబితాను ప్రకటించారు. మొత్తం ముప్పై వార్డుల్లో 50,834 మంది ఓటర్లు ఉన్నారు. 1,277 నుంచి 2,849 మంది ఓటర్లతో ఇక్కడ వార్డుల విభజన జరిగింది. అత్యధికంగా మూడో వార్డులో 2,849 మంది ఓటర్లు ఉంటే పదిహేనో వార్డులో అతి తక్కువగా 1,277 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో వార్డులో 1,500 నుంచి 1,700 మంది ఓటర్లు ఉండేలా విభజన చేస్తామని అధికారులు స్థానికులకు చెప్పారు. ఇందుకు భిన్నంగా వార్డుల విభజన జరగడం పట్ల నిరసన పెల్లుబికిం ది. వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై కొద్దిరోజుల క్రితం అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో కొ న్ని వార్డుల్లో 2వేల మందికి పైగా ఓటర్లు ఉండేలా ప్రతిపాదనలు చేయడం పట్ల రాజకీయ పార్టీల ప్ర తినిధులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ వార్డులో మొ త్తం ఓటర్ల సంఖ్యలో పదిశాతానికి మించి తేడా ఉండకుండా వార్డుల విభజన చేయాలని తేల్చి చె ప్పారు. ఆయా వార్డులోని ఓటర్ల ప్రతిపాదనలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వ ల్ప సవరణతో మున్సిపల్ అధికారులు మంగళవా రం సాయంత్రం వార్డుల విభజన తుది జాబితా ను విడుదల చేశారు. దీనిపై స్థానికంగా నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కొన్ని వార్డుల్లో 2 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. మూడో వా ర్డులో 2,849, ఇరవై మూడో వార్డులో 2,312, నాలుగో వార్డులో 2,214, ఐదో వార్డులో 2,187 మంది ఓటర్లతో వార్డుల విభజన జాబితా విడుదలైంది. అలాగే రెండో వార్డులో 1,898, పదకొండవ వార్డులో 1,898, ఇరవై ఏడో వార్డులో 1,892, ఆరో వార్డులో 1,884, ఇరవై ఒకటో వా ర్డులో 1,810, పదో వార్డులో 1,809, పదిహేడో వార్డులో 1,780, ఇరవై నాలుగవ వార్డులో 1,733, ఇరవై వార్డులో 1,725 మంది ఓటర్లు ఉన్నారు. ఇలా పలు వార్డుల్లో 1,700లకు పైగా ఓటర్లతో విభజన చేయడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా నాలుగు వార్డుల్లో 2 వేల మందికి పైగా ఓటర్లు ఉండటం, మూడో వార్డులో 2,849 మంది ఓటర్లు ఉండేలా విభజన జరగడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. కొద్ది రోజుల క్రి తం రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై అధికారులు నిర్వహించిన సమావేశంలో సవరణ కోసం పలు ఫిర్యాదు లు, సూచనలు అందినప్పటికీ వాటిని అంతగా ప రిగణలోకి తీసుకోకుండా స్వల్ప సవరణలతో విభజన తుది జాబితా వెలువడిందని ఆక్రోశిస్తున్నా రు. మున్సిపల్ అధికారుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కొన్ని వార్డుల్లో తక్కువ మంది..
అధికారులు విడుదల చేసిన వార్డుల తుది జా బితాలో కొన్ని వార్డుల్లో ముందుగా చెప్పినదానికంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 1,500 లోపు ఓటర్లతో ఈ వార్డుల విభజన జరిగింది. ప దిహేనో వార్డులో 1,277, పద్దెనిమిదో వార్డులో 1,283, ఒకటో వార్డులో 1,316, తొమ్మిదో వా ర్డులో 1,319, ఎనిమిదో వార్డులో 1,331, పం తొమ్మిదో వార్డులో 1,357, ఇరవై ఎనిమిదో వా ర్డులో 1,427, పద్నాలుగో వార్డులో 1,432, పదిహేడో వార్డులో 1,454, ఇరవై తొమ్మిదో వార్డులో 1,479 మంది ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 50,834 మంది ఓటర్లలో పురుషులు 26,479, మహిళలు 24,355 మంది. కేవలం 15, 17, 29, 30వ వార్డుల్లో మాత్రమే పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కు వ మంది ఉన్నారు. పదిహేనో వార్డులో పురుషు లు 628, మహిళలు 649, పదిహేడో వార్డులో పురుషులు 868, మహిళలు 912, ఇరవై తొమ్మి దో వార్డులో పురుషులు 725, మహిళలు 754, ముప్పైవ వార్డులో పురుషులు 816, మహిళలు 880 మంది ఉన్నట్లు తాజాగా విడుదలైన వార్డుల విభజన తుది జాబితాలో అధికారులు వెల్లడించా రు. ఈ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఓటర్ల సంఖ్య 50,074. వీరిలో పురుషులు 26,093, మహిళలు 23,981 మంది. తాజాగా 760 మం ది తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. వీ రిలో పురుషులు 386, మహిళలు 374 మంది ఉన్నారు. పెరిగిన ఓటర్లతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల సంఖ్య 50,834కు చేరిం ది. కొత్తగా ఓటర్లు తమ పేరు నమోదు చేసుకోవడానికి గడువు ఉన్నందున ఇక్కడ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

బీసీ ఓటర్లు అత్యధికం..
ఓటర్ల కుల గణన చేసిన అధికారులు తుది జాబితాను మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లలో ఎస్సీలు 7,394, ఎస్టీలు 3,970, బీసీలు 30,457, ఇతరులు 9,013 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లలో పురుషులు 3,718, మహిళలు 3,676, ఎస్టీ ఓటర్లలో పురుషులు 2,008, మహిళలు 1,962, బీసీ ఓటర్లలో పురుషులు 15,852, మహిళలు 14,605, ఇతర ఓటర్లలో పురుషులు 4,968, మహిళలు 4,045 మంది ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ ఉన్న మొత్తం 50,834 మంది ఓటర్లలో దాదాపు అరవై శాతం మంది బీసీలే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. వార్డు వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్ల తుది జాబితా వెల్లడి కావడంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై చర్చ తెరపైకి వచ్చింది. ఓటర్ల కుల గణన జాబితా ప్రకారం వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు రిజర్వ్ అయ్యే వార్డులపై ప్రాథమికంగా క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్ల తుది జాబితా విడుదలైన దరిమిల రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles