వాగులపై చెక్ డ్యాములు నిర్మించండి

Wed,July 10, 2019 02:16 AM

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న వాగులపై విస్తృతంగా చెక్ డ్యాములు నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. చెక్‌డ్యాంల వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకుని సాగుచేసుకునేందు కు అవకాశం ఏర్పడుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని చిన్న నీటి పారుదల శాఖ జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన ఎస్‌ఈ జయరాం, ఇతర అధికారులతో రివ్యూ నిర్వహించారు. దేవరకద్ర నియోజకవర్గం పెద్ద పెద్ద వాగులకు చిరునామా అని వ ర్షాకాలంలో వాగుల్లో నీరు పెద్ద ఎత్తున పారి వృథాగా పోతోందన్నారు. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలనన్నారు. ఇందుకు చెక్ డ్యాంల నిర్మాణం ఎంతో ఉపయుక్తమని ఆయన తెలిపారు. అధికారులు ఈ అంశంపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. చెక్ డ్యాంల వల్ల నీటిని సంరక్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా ఇందుకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎస్‌ఈ జయరాం, ఈఈ నర్సింగరావు, డీఈ చందు, చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ సురేందర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles