రికార్డుస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలి

Wed,July 10, 2019 02:17 AM

నవాబ్‌పేట: రికార్డు స్థాయిలో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు చేయించాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని లోకిరేవు గ్రామంలో మంగళవారం చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాలను ఉద్యమంలా చేపట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామాల్లో చేపడుతున్న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లబిస్తోందని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. నవాబ్‌పేట మండలానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సిములు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, మాజీ ఎంపీపీ శీనయ్య, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ రాధాక్రిష్ణ, నాయకులు పాశం గోపాల్, ప్రతాప్, యాదిరెడ్డి, మెండె లక్ష్మయ్య, మధుసూదన్‌రెడ్డి, పాశం క్రిష్ణయ్య, వెంకటేష్, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles